ఆన్వీ ఫెర్టిలిటీ అండ్ ఉమెన్స్ అడ్వాన్స్డ్ ఐవీఎఫ్ ట్రీట్ మెంట్ సెంటర్ ని లాంచ్ చేసిన MLA కాలేరు వెంకటేష్
హైదరాబాద్ ,తిలక్ నగర్
మాతృత్వం మహిళలకు దేవుడు ఇచ్చిన వరమని MLA కాలేరు వెంకటేష్ అన్నారు.
సంతాన లేమి సమస్యలతో బాధపడుతున్న వారికి ప్రస్తుతం సరికొత్త పరిజ్ఞానంతో వైద్య సేవలు అందిచడం అభినందనీయమని అన్నారు. హైదరాబాద్ శివం రోడ్ లోని తిలక్ నగర్ లో ఆనవి ఫెర్టిలిటీ అండ్ ఉమెన్స్ సెంటర్ ని ఆయన ప్రారంభించారు. ప్రముఖ డాక్టర్ స్వర్ణ లేటెస్ట్ అడ్వాన్స్డ్ ఐ వీ ఎఫ్ విధానంను అందుబాటులోకి తీసుకు రావడం సంతోషంగా ఉందన్నారు . మాతృత్వం ఒక వరం. ఏ స్త్రీ కైనా గొప్ప వరమని… మారుతున్న జీవన విధానం, వాతావరణంలో మార్పులు, వృత్తిపరమైన జీవితం, పెరిగిన ఒత్తిడి, పిల్లలు లేని సమస్య పెరుగుతున్నాయని డాక్టర్ స్వర్ణ తెలిపారు.
ఆనవి ఫెర్టిలిటీ ఉమెన్స్ సెంటర్ పిల్లలు లేని కారణాలను సరైన రోగ నిర్ధారణ చేసి విశ్లేషిస్తామననారు. వైద్య శాస్త్రంలో తాజా సాంకేతిక ఆవిష్కరణల ద్వారా తగిన చికిత్సను అందించడం ద్వారా ఈ కీలకమైన సమస్యను వేగంగా పరిష్కరించడానికి ప్రయత్నిస్తోందని డాక్టర్ స్వర్ణ అన్నారు. సంతాన లేని సమస్యల కోసం ఆనవి ఫెర్టిలిటీ ఉమెన్స్ సెంటర్ అత్యాధునిక అడ్వాన్స్డ్ ఐవీఎఫ్ ఉమెన్స్ కి అన్ని రకాల ప్రాబ్లమ్స్ కి ట్రీకుమెంట్ అందించేందుకు సిద్ధమైందన్నారు. ప్రతి ఒక్కరు కి అందుబాటు ధరలో మాతృత్వాన్ని అందిస్తామని డాక్టర్ స్వర్ణ వెల్లడించారు.