హైదరాబాద్ మాదాపూర్‌లో బెస్ట్ విజన్ ఐ ఆసుపత్రిని ప్రారంభించిన ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ

హైదరాబాద్‌,మాదాపూర్

సామాన్య మధ్యతరగతి ప్రజలకు కార్పోరేట్ వైద్యాన్ని అతితక్కవ ఖర్చుతో అందించినప్పుడే ఆ ఆసుపత్రి మనుగడ సాధిస్తుందని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ అన్నారు .

హైదరాబాద్ మాదాపూర్ కావూరి హిల్స్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన బెస్ట్ విజన్ ఐ ఆసుపత్రిని ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, సన్‌షైన్ ఆసుపత్రి ఛైర్మన్ గురువారెడ్డి, యశోద ఆసుపత్రి ఛైర్మన్ జీఎస్‌రావులు ప్రారంభించారు

.

అత్యున్నత శ్రేణి సదుపాయాలు, సుశిక్షితులైన సిబ్బంది కలిగిన ఈ నూతన  కేంద్రంలో అన్ని రకాల కంటి సమస్యలకూ అత్యంత వేగంగా చికిత్సను అందిస్తామని బెస్ట్‌ విజన్‌ ఐ హాస్పిటల్‌  కో ఫౌండర్లు సాహిత్య దేవు. దివ్యలు తెలిపారు . లేసిక్‌ సర్జరీని కేవలం 1.5 సెకన్లలోనే చేస్తే , క్యాటరాక్ట్‌ సర్జరీని ఐదు నిమిషాలలో చేయగలమన్నారు .అంతేకాకుండా  2మిల్లీమీటర్ల కోతతో క్యాటరార్ట్‌ సర్జరీ చేయడంతో పాటుగా చిన్నారులు, పెద్ద వయసు వారికి ప్రత్యేకమైన చికిత్సలను అందించనున్నారు. ప్రజలకు సేవ చేయాలనే సేవా దృక్సథంతో ఆసుపత్రిని ఏర్పాటు చేశామని..ఐ ఆసుపత్రుల్లో అత్యుత్తమ ఆసుపత్రిగా నిలువాలనేదే తమ లక్ష్యం అన్నారు. పిడయాట్రిక్‌ ఐ కేర్‌, కార్నియా మార్పిడి, గ్లౌకోమా వంటి సేవలతో పాటుగా అవసరమైన అన్ని కంటి చికిత్సలనూ అందిస్తామన్నారు ప్రపంచ శ్రేణి సాంకేతికతతో కూడిన యంత్రాలతో చికిత్స అందిస్తున్నట్లు వివరించారు .

సాధారణ కంటి సమస్యలైనటువంటి కాటరాక్ట్‌, రిఫ్రాక్టివ్‌ ఎర్రర్స్‌తో పాటుగా ఈ నూతన సూపర్‌ స్పెషాలిటీ ఐ కేర్‌ సెంటర్‌లో గ్లౌకోమా, డయాబెటిక్‌ రెటినోపతి, మాక్యులర్‌ డీజనరేషన్‌, కార్నియా కండిషన్స్‌, కాస్మెటిక్‌ ఆక్యులోప్లాస్టీ, యువీఈఏ , పెడియాట్రిక్‌ కేర్‌ సేవలను అందిస్తున్నట్లు నిర్వహకులు తెలిపారు .

ఈ హాస్పిటల్‌ను శేరిలింగం పల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, సన్‌షైన్‌ హాస్పిటల్స్‌ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్ – డాక్టర్‌ ఏ వీ గురవారెడ్డి. యశోద ఆసుపత్రి ఛైర్మన్ జీఎస్ రావు, మాదాపూర్‌ కార్పోరేటర్‌ వి జగదీశ్వర్‌ గౌడ్‌, బెస్ట్‌ విజన్‌ ఐ హాస్పిటల్స్‌ కో –ఫౌండర్లు డాక్టర్‌ సాహిత్య దేవు, డాక్టర్‌ దివ్య రెడ్డిలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *