అస్టర్ ప్రైమ్ హాస్పిటల్ ,బంజారా వెల్పేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత మెగా ఆరోగ్య శిభిరాన్ని ప్రారంభించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

హైదరాబాద్

ప్రజలు తమ ఆరోగ్యాన్ని పరిరక్షించుకునే విషయంలో కొంత నిర్లక్ష్యం వహిస్తున్నారని…ఇది మంచి పద్దతి కాదని రాష్ట్ర పశుసంవర్థక, పిషరీస్, పాడి పరిశ్రమాభివృద్ది మరియు సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు .

హైదరాబాద్ అమీర్ పేట్ అస్టర్ ప్రైమ్ హాస్పిటల్, బంజారా వెల్పేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా ఆరోగ్య శిబిరాన్ని మంత్రి శ్రీనివాస్ యాదవ్ లాంచనంగా ప్రారంభించారు. ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ రాజశేఖరన్, డాక్టర్ మురళీ కృష్ణ తదితరులు మంత్రికి ఉచిత వ్యాధి నిర్థారణ శిబిరంలో పరీక్షలు నిర్వహించారు .

ఈ సందర్భంగా రాష్ట్ర పశుసంవర్థక, పిషరీస్, పాడి పరిశ్రమాభివృద్ది , సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ మాట్లాడుతూ బస్తీలలో ఉండే పేదలు పలు కారణాలతో చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను పట్టించుకోకుండా అది పెద్దదైన తర్వాత ఇబ్బంది పడుతుంటారని చెప్పారు. ఇలాంటి వారికి స్వాంతన చేకూర్చేందుకే ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్ సహకారంతో నియోజకవర్గంలోని పలు బస్త్రీలలో ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నామన్నారు. హైదరాబాద్ బాపూ నగర్ లో ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు . ఇక్కడ చేస్తున్న వైద్య పరీక్షలన్నింటినీ బస్తీ వాసులు పెద్ద సంఖ్యలో సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ముఖ్యంగా ఎక్కువ సంఖ్యలో ఉన్న వృద్దులందరూ హాజరై పరీక్షలు చేయించుకోని ఆరోగ్య సమస్యలుంటే నివారించుకోవాలన్నారు . ఇలాంటి వైద్య శిబిరాలను నిర్వహించడానికి ముందుకు వచ్చిన ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్ యాజమాన్యానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ధన్యవాదములు తెలిపారు .

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ తో పాటు అమీర్ పేట్ మాజీ కార్పోరేటర్ శేషుకుమారి ,బాపూ నగర్ బంజారా వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు హరిసింగ్ యాదవ్,అసోసియేషన్ సభ్యులు కిషన్ సింగ్, దశరథ్ కుమార్, గోపీ చంద్, సీతారాం, రాజూ నాయక్, రమేష్, నవీన్ లతో పాటు కాలనీ వాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్ కు చెందిన వైద్యులు డా. రాజశేఖరన్, డా. మురళీ కృష్ణ, బ్రాండింగ్ మేనేజర్ సుధీర్ బాసురి లతో పాటూ పలువురు నర్సింగ్, పారామెడికల్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *