తెలంగాణ రాష్ట్రాన్ని క్రీడా హబ్ గా తీర్చిదిద్దుతాం మంత్రి శ్రీనివాస్ గౌడ్
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత క్రీడల అభివృద్ధికి సీఎం కేసీఆర్ పెద్ద పీట వేశారని రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి V. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్ మినిస్టర్స్ కాలనీలోని మంత్రి నివాసంలో సికింద్రాబాద్ కు చెందిన బాక్సింగ్ క్రీడాకారిణి S M వైష్ణవి హర్యానా లో జరిగిన 1st TAFISA ఓపెన్ నేషనల్ గేమ్స్ – 2021 లో గోల్డ్ మెడల్ సాధించిన సందర్భంగా మంత్రి అభినందించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత CM కేసీఆర్ గారు క్రీడల అభివృద్ధి కి పెద్దపీట వేస్తున్నారన్నారు. అందులో భాగంగా రాష్ట్రంలో క్రీడా పాలసీ ని రూపొందిస్తున్నామన్నారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రం క్రీడా హబ్ గా తీర్చిదిద్దుతు న్నామన్నారు. బాక్సింగ్ లో అద్భుత ప్రతిభ కనబరుస్తూ జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించిన SM వైష్ణవి అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని మంత్రి ఈ సందర్భంగా ఆకాంక్షించారు. త్వరలో నేపాల్ లో జరగనున్న 1st TAFISA ఇండో – నేపాల్ ఇంటర్నేషనల్ ఛాంపియన్ షిప్ లో పతకాన్ని సాధించి బాక్సింగ్ లో తెలంగాణ రాష్ట్రానికి పేరు తేవాలన్నారు మంత్రి V. శ్రీనివాస్ గౌడ్
ఈ కార్యక్రమంలో కోచ్ కృష్ణ, తల్లిదండ్రులు శ్రీనివాస్, వెన్నెల లతో పాటు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.