తెలంగాణ ప్రీమియర్ గోల్ఫ్ లీగ్ లోగోను ఆవిష్కరించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత క్రీడా రంగానికి ప్రభుత్వం పలు ప్రోత్సాహకాలు అందిస్తుందని రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి V. శ్రీనివాస్ గౌడ్ గుర్తు చేశారు. హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్ లో తెలంగాణ ప్రీమియర్ గోల్ఫ్ లీగ్ లోగోను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… రాష్ట్రంలో గోల్ఫ్ క్రీడా అభివృద్ధి కి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకున్నామన్నారు. చారిత్రాత్మక గోల్కొండ కోట కు అనుబంధం గా ఉన్న హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్ కు దేశంలోనే ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతులు ఉన్నాయన్నారు. గోల్ఫ్ అభివృద్ధి కి ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. 2022 లో జరగబోయే అంతర్జాతీయ గోల్ఫ్ టౌర్నమెంట్ కు.ఏర్పాట్లు చేస్తున్నమన్నారు. సీఎం కేసీఆర్, మున్సిపల్ మినిష్టర్ KTR ల సహకారంతో గోల్ఫ్ క్రీడను అభివృద్ధి చేస్తామన్నారు. రాష్ట్రంలో క్రీడల అభివృద్ధి కి సీఎం కేసీఆర్ గారు క్రీడా పాలసీని ప్రవేశపెట్టారన్నారు. క్రీడా పాలసీ రూపకల్పన లో గోల్ఫ్ క్లబ్ కమిటీ సలహాలు, తీసుకుంటామన్నారు. దేశంలోనే అత్యుత్తమ క్రీడా పాలసీ ని రూపొందించబోతున్నామన్నారు. క్రీడాకారులకు, కోచ్ లకు పెద్ద పీట వేస్తామన్నారు. గోల్ఫ్ క్లబ్ నిరంతరం నిర్వహించేలా కార్యక్రమాలు చేపట్టాలన్నారు మంత్రి V. శ్రీనివాస్ గౌడ్ .

ఈ కార్యక్రమంలో హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్ అధ్యక్షులు దయాకర్ రెడ్డి, కెప్టెన్ భాస్కర్ రెడ్డి, కార్యదర్శి BVK రాజు, మాజీ అధ్యక్షుడు విక్రమ్ దేవ్ రావు, క్లబ్ సభ్యులు, గోల్ఫ్ క్రీడాకారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *