శివగంగ ప్రాంతంలో పైప్ లైన్ పనులకు శంఖుస్థాపన చేసిన మంత్రి పేర్ని వెంకట రామయ్య
శివగంగ ప్రాంతంలో పైప్ లైన్ పనులకు మంత్రి శంఖుస్థాపన
మచిలీపట్నం
మచిలీపట్నం నగరపాలక సంస్థ పరిధిలో ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి ఇబ్బందులపై దృష్టి కేంద్రీకరించి ఆయా సమస్యలను పరిష్కరించడమే ప్రజా ప్రతినిధులుగా తమ ముఖ్య బాధ్యతని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) పేర్కొన్నారు. కృష్ణ జిల్లా మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 30 వ డివిజన్ శివగంగ ప్రాంతంలో 7 లక్షల రూపాయల వ్యయంతో 550 మీటర్ల పైప్ లైన్ పనులకు మంత్రి పేర్ని వెంకట్రామయ్య శంఖుస్థాపన చేశారు. అనంతరం మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ, గత నాలుగేళ్లుగా ప్రజలు పడుతున్న ఇబ్బందిని కార్పొరేటర్ మిరియాల నాగ బసవ పూర్ణిమ, డివిజన్ ఇంచార్జ్ మిరియాల రాంబాబు తన దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు.ఈ సమస్య పరిష్కారం కోసం నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ పైప్ లైన్ శంఖుస్థాపన కార్యక్రమంలో మచిలీపట్నం నగరపాలక సంస్థ మేయర్ మోకా వెంకటేశ్వరమ్మ, డిప్యూటీ మేయర్లు తంటిపూడి కవిత, లంకా సూరిబాబు మచిలీపట్నం మాజీ మునిసిపల్ ఛైర్మెన్ షేక్ సలార్ దాదా, మచిలీపట్నం మార్కెట్ యార్డ్ ఛైర్మెన్ షేక్ ముస్తఫా ( అచ్చాభా) 13 వ డివిజన్ ఇంచార్జి బందెల థామస్ నోబుల్, ఎం ఇ త్రినాధ్ రావు, ఏ ఇ వర ప్రసాద్, పిల్లి ప్రసాద్ , పరమాత్మ బాగ్స్ వర్క్స్ రమేష్, పళ్లెం కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.