ఆల్వాల్ లో టిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి స్థలాన్ని పరిశీలించిన మంత్రి హరీశ్ రావు ..ఈ నెల 26 న భూమి పూజ చేయనున్న సీఎం కేసీఆర్
హైదరాబాద్ నలుమూలల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మానాకి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఆల్వాల్ లో నూతనంగా నిర్మించనున్న టిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి సీఎం కేసీఆర్ ఈ నెల 26న భూమి పూజ చేయనున్నారు. ఈ నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు ఆల్వాల్ లో నిర్మించనున్న టిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి స్థలాన్ని పరిశీలించారు. హరీశ్ రావుతో పాటు ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు, ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, హెల్త్ సెక్రెటరీ రిజ్వీ, సీఎం ఓఎస్డీ గంగాధర్, TSMSIDC ఎండి చంద్ర శేఖర్ రెడ్డి, వైద్యారోగ్య శాఖ అధికారులు, ఆర్ అండ్ బీ అధికారులు, ఇతర నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.