దేశానికే తలమానికంగా మానేరు రివర్ ప్రంట్ -ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన మంత్రి గంగుల కమలాకర్
2.6 కిలోమీటర్ల పనులకు టెండర్లు
మెదటి దశ నిర్మాణానికి సర్వం సిద్దం
రాబోయే బడ్జెట్లోనూ మరిన్ని నిధులకు ప్రతిపాదనలు
ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన మంత్రి గంగుల కమలాకర్
కరీంనగర్ పై సీఎం కేసీఆర్ గల ప్రత్యేక ప్రేమకు నిదర్శనం మానేరు రివర్ ప్రంట్ అని..అతి త్వరలోనే ప్రాజెక్టు పట్టాలెక్కబోతుందన్నారు రాష్ట్ర బిసి సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. హైదరాబాద్ జలసౌద కార్యాలయంలో ఇరిగేషన్, టూరిజం, రెవెన్యూ శాఖల ఉన్నతాధికారులతో మానేరు రివర్ ప్రంట్ పై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. గతంలోనే 410 కోట్లు మానేరు రివర్ ఫ్రంట్ కోసం మంజూరు అయ్యాయని సీఎం కేసీఆర్ ఎన్ని నిధులైనా వెచ్చించేందుకు ఉన్నారని, రాబోయే బడ్జెట్లో సైతం సమర్పించాల్సిన ప్రతిపాదనలపై చర్చించామన్నారు. ప్రాజెక్టులో అంతర్బాగమైన తీగలవంతెన ప్రారంభానికి సిద్దమైందన్నారు మంత్రి గంగుల. దాదాపు పదికిలోమీటర్ల పాటు నిర్మించతలపెట్టిన ప్రాజెక్టులో మొదటి విడతగా 2.6 కిలోమీటర్ల మేర నిర్మాణాలకు సంబందించిన డీపీఆర్ పనులు పూర్తయి టెండర్లు పిలిచామని వెల్లడించారు. రిటైనింగ్ వాల్, అప్పర్ ప్రామినాడ్, లోయర్ ప్రామినాడ్ మద్య నిర్మాణాలకు సంబందించి సమావేశంలో కీలకంగా చర్చించామన్నారు, రాబోయే తరాలకు అందంగా మానేరు రివర్ ప్రంట్ ను రూపుదిద్దుతామన్నారు మంత్రి గంగుల కమలాకర్.
మానేరు రివర్ ప్రంట్ ప్రాజెక్టులో బోటింగ్, అమ్యూజ్ మెంట్ పార్కులు, వాటర్ స్పోర్ట్స్, పౌంటేన్లు, చిల్డ్రన్ పార్క్స్, కిడ్స్ ప్లే ఏరియాలు, ఆడిటోరియం, మ్యూజియం, సీనియర్ సిటిజన్ గార్డెన్స్, ప్లవర్ గార్డెన్లు, రాక్ గార్డెన్లు, లేజర్ షోలు, విశాలమైన లాండ్ స్కేపింగులు, ఇంకా స్పోర్ట్ ఎన్ క్లేవ్లో బాగంగా టెన్నిస్, వాలిబాల్ ఇతర స్పోర్ట్స్ కోర్టులు, ప్రాజెక్టు పొడవునా వాకింగ్, జాగింగ్ ట్రాకులతో భారత దేశానికే తలమానికంగా మానేరు రివర్ ఫ్రంట్ రూపొందిస్తున్నామన్నారు మంత్రి గంగుల కమలాకర్.
ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఈఎన్సీ మురళీధర్, టూరిజం శాఖ ఈడి శంకర్ రెడ్డి, ఇరిగేషన్ ఎస్ఈ శివకుమార్, నాగభూషణం, కరీంనగర్ ఆర్డీవో, ఐఎన్ఐ కన్సల్టేన్సీ డైరెక్టర్ హర్ష్ గోయల్, ఇతర రాష్ట్ర, జిల్లా ఇరిగేషన్, టూరిజం, రెవెన్యూ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.