వైకుంఠ ఏకాదశి పర్వదినాన తిరుపతి వెంకన్న సేవలో మంత్రి ఎర్రబెల్లి
తిరుమల :
నూతన సంవత్సరం ప్రారంభమైన రెండవ రోజు వైకుంఠ ఏకాదశి పర్వదినం రావడంతో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కుటుంబ సమేతంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో కొలువై ఉన్న కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని వేకువజామునే దర్శించుకున్నారు.

తెలంగాణ, ఆంధ్ర, భారత దేశ ప్రజలు బాగుండాలని ఆ భగవంతున్ని కోరుకున్నట్లు తెలిపారు. శ్రీవారి ఆశీర్వాదం, అనుగ్రహం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఉందని, ఆ అనుగ్రహంతో మరెన్నో ప్రజోపయోగ పనులు చేస్తారని తెలిపారు.

వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తిరుపతికి రావడం తనకు ఆనవాయితీ అని, ఆ శ్రీవారిని దర్శించుకోవడం అదృష్టమని తెలిపారు.
