శ్రీ వేంక‌టేశ్వ‌ర దేవాల‌యాన్ని ప్రారంభించిన మంత్రి అల్లోల‌

నిజామాబాద్,

నిజామాబాద్ జిల్లా జ‌క్రాన్ ప‌ల్లి మండలం ప‌డ‌క‌ల్ గ్రామంలో నిర్మించిన‌ శ్రీ భూనీళా సమేత బంగారు వెంక‌టేశ్వ‌ర స్వామి వారి నూతన దేవాలయాన్ని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ప్రారంభించారు. ఆలయం ప్రారంభించిన తరువాత ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ…ఆల‌యాల అభివృద్ది కోసం తెలంగాణ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందన్నారు. ఇందులో భాగంగానే టీఆర్ఎస్ ప్రభుత్వం ఆలయాల అభివృద్దికి, చారిత్రక ప్రాంతాల అభివృద్దికి పెద్ద పీట వేస్తుందని పేర్కొన్నారు. రూ. కోటి నిధులు వ్యయం చేసి శ్రీ వెంక‌టేశ్వ‌ర ఆల‌యాన్ని నిర్మించార‌ని, దేవాదాయ శాఖ రూ. 50 ల‌క్ష‌లు మంజూరు చేయ‌గా, గ్రామ‌స్తులు మ‌రో 50 ల‌క్ష‌ల రూపాయాలు కంట్రీబ్యూట్ చేశార‌న్నారు. నిజామాబాద్ జిల్లా లో నూతనంగా 175 ఆలయాలు నిర్మిస్తే ఒక్క నిజామాబాద్ రూరల్ లొనే 50 ఆలయాలు నిర్మించామని తెలిపారు.నూతనంగా మరో 15 ఆలయాలను నిర్మించాలని వినతి పత్రాలు వచ్చాయని తప్పకుండా కృషి చేస్తానని అన్నారు అలాగే డిచ్ పల్లి లో ఖిల్లా రామాలయం అభివృద్ధి చేస్తానని అన్నారు.ఈ కార్య‌క్ర‌మంలో ఆర్టీసీ చైర్మ‌న్ బాజిరెడ్డి గోవ‌ర్ధ‌న్ తో పాటు స్థానిక ప్ర‌జా ప్ర‌తినిధులు పాల్గొన్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *