మానసిక వికలాంగులు దైవంతో సమానం: సమాచార హక్కు చట్టం మాజీ ప్రధాన కమిషనర్ డాక్టర్ వర్రె వెంకటేశ్వర్లు
హైదరాబాద్, 06, సెప్టెంబర్, 2021
మానసికంగా బాధపడుతున్న పిల్లలను మామూలు మనుషులుగా చేయడమనేది ఎంతో ఓపికతో, నైపుణ్యంతో కూడుకున్న పని అని సమాచార హక్కు చట్టం మాజీ ప్రధాన కమిషనర్ డా. వర్రె వెంకటేశ్వర్లు అన్నారు. హైదరాబాద్ తెలుగు యూనివర్శిటీలో గణామస్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవం వేడులకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి సంస్థ పౌండర్ మాదినేని కళ్యాణి చౌదరి అధ్యక్షత వహించగా ఆయన ముఖ్య అతిథిగా హజరై మాట్లాడారు. ప్రభుత్వం ఇలాంటి పిల్లలపై ప్రత్యేక దృష్టి సారించి వీరి అభివృద్దికి పాటుబడాలన్నారు. మానసిక వైకల్యంతో బాధపడుతున్న ఇలాంటి విద్యార్థులకు చదువు చెప్పడం ఎంతో ఓపికతో కూడుకున్న విషయం అన్నారు. ఒక వ్యక్తి ఉన్నతికి ప్రధానపాత్ర పోషించేది గురువులేనని..అలాంటి గురువులను సన్మానించుకోవడం మన కనీస బాధ్యత అన్నారు. విశిష్ట అతిథిగా పాల్గొన్న సంగారెడ్డి జిల్లా జైలు ఓపెన్ సూపరింటెండెంట్ శివకుమార్ గౌడ్ మాట్లాడుతూ మానసిక వైకల్యం ఉన్న పిల్లలు దైవాంశ సంభూతులని, వీరిని అనునిత్యం గమనిస్తూ వారిలో మార్పు కోసం ప్రయత్నించాలన్నారు. ఇలాంటి పిల్లల అభివృద్ది కోసం పాటు బడుతున్న గణామస్ లాంటి సంస్థలకు మరింత సహకారం అందించాలని, తమ వంతు బాధ్యతగా సహయం అందిస్తానన్నారు. మానసిక వైకల్యంగల పిల్లలకు చదువు చెపుతున్న ఉపాధ్యాయులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం మానసిక వైకల్యం ఉన్న పిల్లలకు చదువు చెపుతున్న ఉపాధ్యాయులకు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కళా శ్రీనివాస్ ,సంస్థ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.