కోవిడ్ వల్ల దీర్ఘ కాలిక సమస్యలతో బాధపడుతున్న వారి కోసం ప్రత్యేక పోస్ట్ కోవిడ్ క్లినిక్ ను ప్రారంభించిన మెడికవర్ హాస్పిటల్స్

కోవిడ్ వల్ల దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి ఒకే చోట పరిష్కారం

కోవిడ్ మ‌న జీవ‌న‌విధానాన్ని మార్చింద‌ని ..కోవిద్ త‌ర్వాత వ‌చ్చే దీర్ఘాకాలిక స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేందుకు ప్ర‌త్యేకంగా పోస్ట్ కోవిడ్ కేర్ క్లీనిక్ ను అందుబాటులోకి తీసుకువ‌చ్చిన‌ట్లు మెడిక‌వ‌ర్ హాస్పిట‌ల్ ఛైర్మ‌న్ ,మేనేజింగ్ డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ అనిల్ కృష్ణ తెలిపారు. కోవిడ్ మహమ్మారి ఎన్నో జీవితాలను చిదిమేసిందని.. మాన‌వ జీవ‌నాన్ని తారుమారు చేసిందన్నారు. మొదటి వేవ్ లో కరోన పెద్దగా ప్రభావం చూపలేకపోయినా రెండవ వేవ్ లో మాత్రం ఉగ్రరూపం దాల్చి కొన్ని లక్షల చావులకి కారణమయింద‌న్నారు. మళ్ళి మూడవ వేవ్ ఓమిక్రాన్ అంతగా ప్రభావం చూపకపోయినా చాలామంది దీని బారిన పడ్డారని తెలిపారు. జనసమూహం ఎక్కువ ఉండే ప్రదేశాలోలోనే కరోనా అతివేగంగా పంజా విసురుతుందని.. ఇలాంటి చోట చోట మనం ప్రత్యేక‌ జాగ్రత్తలు తీసుకోవాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగాసీనియర్ కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ డాక్టర్ రఘుకాంత్ మాట్లాడుతూ కోవిడ్ వచ్చిన చాలామందిలో దీర్ఘకాలిక సమస్యలైన అలసట,నిద్రలేమి,వాసన/రుచి కోల్పోవడం,నిరంతర దగ్గు,శ్వాస ఆడకపోవుట,ఛాతి నొప్పి,గుండె దడ,తల తిరగడం,డిప్రెషన్, ఆందోళన బాధపడుతూ ఉన్నారు. ఇటువంటి సమస్యల వల్ల వాళ్ళకి ఎక్కడికి వెళ్ళాలి… ఏ డాక్టర్స్ ని సంప్రదించాలి కూడా తెలియడం లేదు…వీటి వ‌ల్ల‌ ఒక్కక్కసారి ఇతర అవయవాలు పాడవటం జరుగుతున్నది. దీని కోసం వారు ఎంతో ఖ‌ర్చు చేస్తున్నార‌ని తెలిపారు. వీట‌న్నింటికి శాశ్విత ప‌రిష్కారం అందించేందుకు పోస్ట్ కోవిడ్ కేర్ క్లీనిక్ ను ఏర్పాటు చేశామ‌న్నారు . అనంత‌రం జ‌న‌ర‌ల్ ఫిజిషియ‌న్ డాక్టర్ లక్ష్మి కాంత్ రెడ్డి మాట్లాడుతూ కోవిడ్ వచ్చి వెళ్ళాక చాలామందికి దీర్ఘకాలిక సమస్యలు అనగా షుగర్ లెవెల్స్ పెరగడం , ఇతర సమస్యలు ఎన్నో వస్తున్నాయి. పోస్ట్ కోవిడ్ క్లినిక్ ప్రారంభించడం ముఖ్య ఉద్దేశం పేషెంట్స్ కి ఒకే చోట అన్ని సమస్యల‌కు పరిష్కరిస్తామ‌న్నారు .పోస్ట్ కోవిడ్ కేర్ కు సంబందించి ఒకే చోట పరిష్కారం చూప‌డంతో పాటు స‌మ‌యం వృధా కాకుండా ఉంటుంద‌ని తెలిపారు. ఈ కార్యక్రమం లో మెడికవర్ హాస్పిటల్స్ వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *