ఫ్యాషన్ ,బ్యూటీ,మేకప్ రంగాల్లో రాణించాలనుకునే యువతకు ఎంబీసీ చక్కటి ఫ్లాట్ ఫాం -తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త
ఫ్యాషన్ ,బ్యూటీ,మేకప్ రంగాల్లో రాణించాలనుకునే యువతకు ఎంబీసీ చక్కటి ఫ్లాట్ ఫాం -తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త
హైదరాబాద్ ,సోమాజీగూడ
బ్యూటీ,ఫ్యాషన్ ,మేకప్ రంగాల్లో రాణించాలనుకునే ఎంబీసీ సంస్థ చక్కటి ఫ్లాట్ ఫాం అందిస్తుందని తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త అన్నారు. హైదరాబాద్ ద పార్క్ హోటల్ లో నేషనల్ వైడ్ ఫ్యాషన్ షో సీజన్ 5 పోస్టర్ ను సంస్థ ప్రతినిధులతో కలిసి ఆయన ఆవిష్కరించారు. బ్యూటీ ఇండస్ట్రీకి చెందిన అన్ని రంగాలను ఒకే వేదికపై తీసుకువచ్చి వారికి ఉపాధి అవకాశాలు కల్పించడం అభినందనీయమన్నారు.సెప్టెంబర్ నెలలో నిర్వహించనున్న సీజన్ 5 ఫ్యాషన్ షోలో పాల్గొనేందుకు ఆసక్తి ఉన్న వారు తమను సంప్రదించాలని మల్టీ బ్రాండ్ కార్నివాల్ ఫౌండర్ మోక్ష్ తెలిపారు .ఈ సందర్భంగా నిర్వహించిన ఫ్యాషన్ షో అందరిని ఆకట్టుకుంది. భారత్ కా సితారే, సైమ,ఎస్ బీఎంఎస్ , ఎంబీసీ ,ఎఫ్ డీ ఎఫ్ సీ సంస్థలకు చెందిన బ్రోచర్లను విడివిడిగా శ్రీనివాస్ గుప్త ఆవిష్కరించారు.