ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేసిన మేయర్ గద్వాల్ విజయలక్ష్మి
హైదరాబాద్ : ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు పౌష్టికాహార లోపాన్ని తగ్గించేందుకు మధ్యాహ్న భోజన పథకం పటిష్టంగా అమలు చేయాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. గురువారం ఎన్.బి.టి నగర్ లోని ప్రభుత్వ పాఠశాల ను మేయర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ పాఠశాలలో చేరే, హాజరయ్యే వారి సంఖ్యను పెంచడం కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయడం జరుగుతున్నదని అన్నారు. ఈ సందర్భంగా మేయర్ పాఠశాలలో తిరిగి పరిశీలించారు. ప్రభుత్వ మెనూ అమలు చేయాలని హెడ్ మాస్టర్ ను ఆదేశించారు. మధ్యాహ్న భోజనం మెనూ ఆధారంగా భోజనం అందిస్తున్నారా అని విద్యార్థులను మేయర్ అడిగి తెలుసుకున్నారు.