ఆంధ్ర రత్న భవన్ లో మౌలానా అబుల్ కలాం ఆజాద్ వర్ధంతి వేడుకలు
విజయవాడ : ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ వర్ధంతి వేడుకలు మంగళవారం విజయవాడ ఆంధ్ర రత్న భవన్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈకార్యక్రమానికి మాజీ ఎంపీ, ఏపీసీసీ పార్టీ ఎన్నికల ప్రధాన అధికారి మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ జాతీయ కార్యదర్శి గిడుగు రుద్రరాజు, ఏపీఆర్ ఓ స్పెన్సర్ లాల్ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మీనాక్షి నట రాజన్ మాట్లాడుతూ స్వాతంత్ర్య సమర యోధుడు, భారత ప్రభుత్వ తొలి విద్యాశాఖామంత్రి, మౌలానా అబుల్ కలాం ఆజాద్ అని అన్నారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ భారత స్వాతంత్ర్య సమర ముఖ్య నాయకులలో ఒకరని, ప్రఖ్యాత పండితుడు, కవి అని అన్నారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ అరబిక్, ఇంగ్లీష్, ఉర్దూ, హిందీ, పెర్షియన్, బెంగాలీ మొదలగు అనేక భాషలలో ప్రావిణ్యుడని, భారత ప్రభుత్వంలో 11 సంవత్సరాలపాటు విద్యాశాఖామంత్రిగా పనిచేసారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో లీగల్ సెల్ రాష్ట్ర చైర్మన్ వళిబొయిన గురునాధం, నగర కాంగ్రెస్ అధ్యక్షులు నరహారశెట్టి నరసింహ రావు, రాష్ట్ర కార్యదర్శి, కార్యాలయం ఇంచార్జి నూతలపాటి రవికాంత్, ఆర్టీఐ చైర్మన్ పీవై కిరణ్, గారా ఉష, బాలు, కిరణ్ ఖాజా, జోసెఫ్ జగన్ తదితరులు పాల్గొన్నారు.