మాతృదేవోభవ” (ఓ అమ్మ కథ) నా కెరీర్ లో నేను సగర్వంగా చెప్పుకునే ఓ మంచి సినిమా: సహస్రాధిక చిత్ర నటీమణి సుధ
సినీ దర్శకులు హరనాథ్ రెడ్డి, నిర్మాతలు చోడవరపు వెంకటేశ్వరావు, ఎంఎస్.రెడ్డి
ఈనెల 18న బ్రహ్మాండమైన విడుదల
“మాతృదేవోభవ” వంటి మంచి సినిమాతో నిర్మాతలుగా పరిచయమవుతుండడం అదృష్టంగా భావిస్తున్నామని నిర్మాతలు చోడవరపు వెంకటేశ్వరావు ,ఎమ్.ఎస్.రెడ్డి అన్నారు. సుధ కెరీర్ లో ఈ చిత్రం ఓ కలికితురాయిగా నిలుస్తుందని, ఈనెల 18న ప్రపంచవ్యాప్తంగా “మాతృదేవోభవ” చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని వారు తెలిపారు . హీరో పతంజలి శ్రీనివాస్, ముఖ్యపాత్రధారులు జెమిని సురేష్, చమ్మక్ చంద్ర, శ్రీహర్ష, కీర్తి, సత్యశ్రీ… “మాతృదేవోభవ” సినిమాలో నటించే అవకాశం లభించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు, ఈ చిత్రం కచ్చితంగా పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందన్నారు.
“మాతృదేవోభవ” వంటి సందేశాత్మక చిత్రంతో దర్శకుడిగా మారుతుండడం గర్వంగా ఉందని చిత్ర దర్శకుడు హరనాథ్ రెడ్డి అన్నారు. నిర్మాతలకు, సీనియర్ నటీమణి సుధ తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు.
సూర్య, జెమిని సురేష్, శ్రీహర్ష, సత్యశ్రీ, సోనియా చౌదరి, అపూర్వ, కీర్తి, జబర్దస్త్ అప్పారావు, షేకింగ్ శేషు తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, పబ్లిసిటీ డిజైన్స్: కృష్ణప్రసాద్, ఫైట్స్: డైమండ్ వెంకట్, కెమెరా: రామ్ కుమార్, ఎడిటింగ్: నందమూరి హరి, సంగీతం: జయసూర్య, పాటలు: అనంత్ శ్రీరామ్-పాండురంగారావు- దేవేందర్ రెడ్డి, మాటలు: మరుదూరి రాజా, కథ: కె.జె.ఎస్.రామారెడ్డి (సితారె), సమర్పణ: ఎం.ఎస్.రెడ్డి, నిర్మాత: చోడవరపు వెంకటేశ్వరావు, స్క్రీన్ ప్లే-డైరెక్షన్: కె.హరనాథరెడ్డి వహిస్తున్నారు.