మాస్టర్ చెఫ్ తెలుగులో హోస్ట్ గా వ్యవహరించడం ఆనందంగా ఉంది :టాలీవుడ్ నటి తమన్నా భాటియా
అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకునే కథానాయిక తమన్నా భాటియా … ఈ కరోనా లాక్‌డౌన్ సమయంలో తన తల్లితో కలిసి అవకాయ పచ్చడి చేయడం నేర్చుకున్నట్లు తెలిపింది.
తినడం వరకు తెలిసిన తనకు వంటలు చేయడం కరోనా నేర్పిందని మురిసిపోయారు.ఒకప్రముఖ చానెల్‌లో ప్రసారం కానున్న మాస్టర్ చెఫ్ కార్యక్రమానికి తెలుగు వ్యాఖ్యాతగా తమన్నా భాటియా వ్యవహరిస్తుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని వెస్టిన్ హోటల్ లో ప్రముఖ హోటల్‌లో మాస్టర్ చెఫ్ తెలుగుకు సంబంధించిన వివరాలను తమన్నాతో పాటు అల్లు శిరీష్, మాస్టర్ చెఫ్స్ సంజయ్, మహేశ్, శ్రీనివాస్ హాజరై వివరాలను వెల్లడించారు.
వంట అంటే కేవలం మహిళలకు మాత్రమే అనుకుంటారని…కానీ వంట చేయడం అదృష్టమని తమన్నా అన్నారు.
తెలుగు వంటకాలను అంతర్జాతీయ వేదికపై పరిచయం చేయడం తనకు చాలా ఆనందంగా ఉందన్నారు. మాస్టర్ చెఫ్ కోసం పోటీ పడేవారిని చూస్తుంటే నాకు కూడ వంటకాలు చేయాలని అలోచన వస్తుందని అల్లు శిరీష్ తెలిపారు.