మణి సాయి తేజ.. ఈ పేరు గుర్తు పెట్టుకోండి..!

సంకల్ప బలం ఉంటే ఏదైనా సాధించగలమన్నది పెద్దల మాట. దీనిని అక్షరాలా నిరూపించాడో యువ హీరో. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి వీరాభిమానైన అతడు.. ఒకప్పుడు అల వైకుంఠపురం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ పాస్ ల కోసం నానా ఇబ్బందులు పడి.. ఇప్పుడు ఏకంగా తన సినిమాకే ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ చేసే రేంజ్ కి వెళ్లాడు. ఆ కుర్రాడి పేరే మణి సాయి తేజ.
మణి సాయి తేజ వజ్ర సంకల్పానికి అతని పేరెంట్స్ ప్రోత్సాహం తోడయ్యింది. దానికి అదృష్టం జటాకలిసింది. నటనలో శిక్షణ తీసుకోవడం మొదలు పెట్టిన మణితేజకు హీరో అవకాశం తలుపు తట్టింది. హీరో అయ్యేందుకు అవసరమైన అన్ని క్వాలిటీస్ అతనిలో పుష్కలంగా ఉండడమే అందుకు కారణం. బ్యాట్ లవర్స్ చిత్రంతో హీరోగా అరంగేట్రం చేసిన మణి… ఆ చిత్రం అప్పటికి ఇంకా షూటింగ్ జరుపుకుంటుండగానే… రుదాక్షపురంలో నటించే అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. ఆర్. కె.గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని… ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది. దీనితో పాటు ముచ్చటగా మూడో సినిమాకు కూడా మణిసాయి సైన్ చేశాడు. సుప్రసిద్ధ దర్శకులు కృష్ణవంశీ శిష్యుడు మునిశేఖర్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా స్వయం కృషితో ఎదగాలని మణిసాయి భావిస్తున్నాడు.
