హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో డెర్మిక్యూ క్లీనిక్ ను ప్రారంభించిన సినీ నటి మంచు లక్ష్మీ
హైదరాబాద్
చర్మ సంబంధిత సమస్యలతో భాదపడుతున్న రోగులకు చక్కటి వైద్యం అందించేందుకు మరొ కొత్త క్లీనిక్ అందుబాటులోకి వచ్చింది .హైదరాబాద్ జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కాలనీలో డెర్మిక్యూ పేరుతో ఏర్పాటు చేసిన క్లీనిక్ ను సినీనటి మంచు లక్ష్మీ, యాంకర్ ఓంకార్ లు ప్రారంభించారు. డెర్మటాలజీ విభాగంలో అత్యుత్తమ ట్రీట్ మెంట్ అందిస్తున్న DERMIQ క్లినిక్ ప్రారంభోత్సవంలో సినీ నటులు సందడి చేశారు . డెర్మటాలజీ రంగంలో విశేష అనుభవం గలిగిన ముగ్గురు వైద్యులు కలిసి ఈ క్లీనిక్ ను ఏర్పాటు చేశారని నిర్మాత మంచు లక్ష్మీ అన్నారు .అడ్వాన్స్ డెర్మటాలజీలకు సంబందించిన వివరాలను డాక్టర్ మంజుల అనగాని విలువైన సూచనలు చేశారు.
DERMIQ లో ఇప్పటి వరకు 7500 మందికి పైగా క్లయింట్లు ట్రీట్మెంట్ చేశామని డాక్టర్ దివ్య శ్రీ తెలిపారు .. లేజర్ హెయిర్ రిడక్షన్, లేజర్ టోనింగ్, స్కిన్ రిజువెనేషన్, పిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, హైడ్రా ఫేషియల్, హెయిర్ ట్రాన్స్ ప్లాన్ టేషన్ వంటి అధునాతన చికిత్సలు DERMIQ లో అందుబాటులో ఉన్నాయని డాక్టర్ లక్ష్మీ దివ్య, డాక్టర్ దీపిక నర్రాలు వివరించారు. DERMIQ సేవలకు గుర్తింపుగా “ బెస్ట్ అండ్ డెడికేటెడ్ సర్వీసెస్ ఇన్ ది మెడికల్ ఫీల్డ్ “ కేటగిరీ లో డాక్టర్ అబ్దుల్ కలాం పురస్కారం తో పాటుగా ప్రతిష్టాత్మక హై బిజ్ టీవీ ఉమెన్స్ లీడర్ షిప్ అవార్డ్ -2021 DERMIQ మెడికల్ టీమ్ కు దక్కిందన్నారు.
ఈ కార్యక్రమంలో పద్మశ్రీ డాక్టర్ మంజుల అనగాని, ప్రముఖ నటి మంచు లక్ష్మి ఫిల్మ్ డైరెక్టర్, టివి ప్రెజెంటర్ ఓంకార్ నాథ్, DERMIQ కో ఫౌండర్స్ డాక్టర్ దివ్య శ్రీ, డెర్మటాలజిస్ట్ డాక్టర్ దీపిక నర్రా , డెర్మటాలజిస్ట్ డాక్టర్ లక్ష్మి దివ్య తో పాటు పలువురు ప్రముఖలు పాల్గొన్నారు.