వివాహేతర సంబంధం, ఆస్తి గొడవలే కారణం..మంచిర్యాల ఘటనలో వెలుగులోకి వాస్తవాలు

మంచిర్యాల జిల్లా గుడిపల్లి ఆరుగురి సజీవదహనం కేసులో వివాహేతర సంబంధమే కారనమని పోలీసులు నిర్ధారించారు. ఆరుగురి సజీవ దహనం కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆస్తి, సింగరేణి వారసత్వ ఉద్యోగం కోసం భర్త శాంతయ్యను ప్రియుడితో కలిసి భార్య సృజన హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. దీంతో పోలీసులు సృజనతో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.

ఆహారంలో మత్తు మందు కలిపి.. మత్తులో జారుకున్నాక పెట్రోల్ పోసి నిప్పంటించారని పోలీసుల విచారణలో తేలింది. ఘటన జరిగిన ఇంటి వెనక సగం కాలిన టైర్లను పోలీసులు గుర్తించారు. వాటికి కొద్ది దూరంలో 20 లీటర్ల పెట్రోలు క్యాన్లు పడి వున్నాయి. దీంతో ఇంటి తలుపు సందులోంచి పెట్రోలు పోసి నిప్పటించినట్టు అనుమానిస్తున్నారు. అయితే, మంటలు చుట్టుముట్టినా లోపలి నుంచి ఎలాంటి అరుపులు వినిపించలేదమంచిర్యాల సజీవ దహనం కేసులో వెలుగులోకి విస్తుపోయే నిజాలు!