మానవ సేవే మాదవ సేవ : రాష్ట్ర గవర్నర్
తిరుపతి : పవిత్ర నగరమైన తిరుమల శ్రీవారి పాదాల చెంత శ్రీ బాలాజీ మెడికల్ కాలేజీ, హాస్పిటల్ , రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రారంభోత్సవం ఎంతో ఆనందంగా వుందని , 2022-23 విద్యా సంవత్సరంలో మొదటి సంవత్సరం ఎం.బి.బి.ఎస్ విద్యార్థులందరికి శుభాభినందనలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ అన్నారు. రేణిగుంట విమానాశ్రయం వద్ద గల శ్రీ బాలాజీ మెడికల్ కళాశాల , హాస్పిటల్ , రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ను గౌరవ గవర్నర్ ప్రారంభించి, ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు.

రాష్ట గవర్నర్ మాట్లాడుతూ ‘మానవ సేవే మాదవ సేవ’ అన్న నినాదంతో వైద్య విద్యార్థులు ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి కృషి చేయాలని అన్నారు. సమాజంలోని మధ్యతరగతి, పేద ప్రజలకు ఆరోగ్యం, విద్యను అందించే దృష్టితో ప్రతిష్టాత్మక సంస్థలు మూడూ శ్రీ కాంచి కామ కోటి ట్రస్ట్, సాయిరాం ఫోండేషన్, ఒరిస్సాలో ఇప్పటికే సేవలందిస్తున్న విజ్ఞాన భారతి చారిటబుల్ ట్రస్ట్ సంయుక్తంగా ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను అందించడానికి ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి కలిసి వచ్చినందుకు ఈ సంస్థలను అభినందిస్తున్నానని అన్నారు. శ్రీ బాలాజీ మెడికల్ కాలేజీ, హాస్పిటల్, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో 2022-23 విద్యా సంవత్సరానికి 150 ఎంబిబిఎస్ విద్యార్థులకు నేటి నుండి వైద్య విద్య అందించే కార్యకలాపాలను ప్రారంభం కావడం సంతోషంగా వుందని అన్నారు. కోవిడ్ -19 మహమ్మారి పరిస్థితిలో నిరుపేదలకు సహాయం అందించడానికి వైద్యులు చేసిన ప్రయత్నాలు సమాజంలోని అన్ని వర్గాల నుండి ప్రశంసలను పొందారని అన్నారు. ఈ మూడు ప్రఖ్యాత సంస్థలు ప్రజలకు మరియు సమాజానికి ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను ప్రతి నిరుపేద వ్యక్తికి ఎటువంటి అడ్డంకులు సహాయం చేస్తాయని ఆకాంక్షిస్తున్నానని అన్నారు. మహాత్మా గాంధీ ఆశయం మేరకు మనుషులుగా మన గొప్పతనం ప్రపంచాన్ని తెలిసేలా మనవంతు కృషి అవసరమని అన్నారు. ఇక్కడ 350 పడకల ఆస్పత్రి తో పాటు 62 ఐ.సి.యు పడకలు, 32 అత్యవసర పడకలు సౌకర్యంతో , 5 ప్రపంచ స్థాయి ఆపరేషన్ థియేటర్లు, 24 గంటలూ అధునాతన ట్రామా కేర్ సదుపాయాలతో సెంట్రల్ ల్యాబ్ , రేడియాలజీ సౌకర్యాలతో సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు వారి ఆర్థిక నేపథ్యంతో సంబంధం లేకుండా, అధునాతన వైద్య మరియు ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలకు ప్రాదాన్యత కల్పిస్తారని ఆశిస్తున్నానని అన్నారు. శ్రీ బాలాజీ మెడికల్ కాలేజీ, హాస్పిటల్ తమ వంతు కృషిగా వ్యాధి రహితంగా రాష్ట్రం లక్ష్యంగా బాధ్యత వహించి ఉత్తమ వైద్యులను తయారు చేసి సమాజానికి అందిస్తుందని నాకు నమ్మకం ఉందని అన్నారు. కోవిడ్ -19 వంటి క్లిష్ట సమయంలో వైద్యులు వారియర్స్ గా నిలిచారని, ప్రదాని, దేశ ప్రజల ప్రసంసలు అందుకున్నారని అన్నారు. మొదటి ఎం.బి.బి.ఎస్. విద్యార్థులందరికి మరో సారి స్వాగతం, శుభాభినందనలని అన్నారు.
రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కె. నారాయణస్వామి మాట్లాడుతూ మనుషుల్లో మహనీయుడుగా పేదల తలరాతలు మారుస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి నవరత్నాలు అమలు చేసిపేదలు ఆర్దికంగా ఎదగాలని విద్య, ఆరోగ్యం, ఇళ్ళు అందించడంతో పాటు రైతులకు పథకాలను అందిస్తున్నారని అన్నారు. కూలీలు డాక్టర్లు కావాలని, పేదరికాన్ని లేకుండా చేయడమే నాపూరి అన్న నినాదంతో కులం , మతం చూడకుండా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు. తన తండ్రి శుఖుస్థాపన చేసిన ఆసుపత్రికి ముఖ్యమంత్రిగా వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో ప్రారంభించడం సంతోషమని అన్నారు.
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని మాట్లాడుతూ వైద్య ఆరోగ్య రంగాన్నినాడు – నేడు తో రూ .1600 కోట్లు ఖర్చు చేసి ప్రభుత్వ ఆసుపత్రుల రూపురేఖలు మార్చి పేదలకు విలువైన వైద్యం అందించాలనే లక్ష్యంగా ముఖ్యమంత్రి పనిచేస్తున్నారని అన్నారు. పేదలకు వైద్య విద్య అందించాలని రూ.8500కోట్లుతో కొత్తగా 17 ప్రభుత్వ కళాశాలు తీసుకురావడం మామూలు విషయం కాదని అన్నారు. వీటిలో ఈ ఏడాదే 5 వైద్య కళాశాలలు ప్రారంభం కానున్నాయని ప్రస్తుతం వున్న11 ప్రభుత్వ కలాశాలలో 2300 సీట్లకు అదనంగా మరో 750 అందుబాటులోకి రానున్నాయని అన్నారు.
రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక , క్రీడల శాఖ మంత్రి ఆర్. కె. రోజా మాట్లాడుతూ నేనూ డాక్టర్ కావాలని తిరుపతి పద్మావతి కళాశాలలో బై.పి.సి. తీసుకున్నాని కానీ యాక్టర్ అయి పోలిటీసియన్ గా మారని అన్నారు. వైద్యో నారాయణో హరి అంటారు, మనం ఊపిరి పోసిన దేవునికి, ఊపిరి నిలిపే వైద్యునికి మాత్రమే దండం పెడతామని అన్నారు. ముందు చూపు వున్న నాయకుడిగా కోవిడ్ -19 సమయంలో ఆదుకున్నందుకు కోట్లాది మంది పేదల మన్నలు పొందారని అన్నారు. తన తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ గా ఒక రూపాయికే వైద్యం అందిస్తే ప్రస్తుతం ఒక్కరూపాయి ఖర్చు లేకుండా పేదలకు ఆరోగ్యశ్రీ అమలు చేస్తున్నారని అన్నారు.
స్థానిక శాసన సభ్యులు బియ్యపు మధుసూదన రెడ్డి మాట్లాడుతూ పేదలకు సేవలందించాలనే గొప్ప భావనతో నేడు మన రాష్ట్ర గవర్నర్ శ్రీ బాలాజీ మెడికల్ కాలేజీ, హాస్పిటల్, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రారంభోత్సవం చేశారని అన్నారు. అనేక రాష్ట్రాల పిల్లలు ఇక్కడ చదువుకోవడానికి ఇక్కడి రావడం సంతోషంగా వుందని, ఇప్పటికే ఐ ఐ టి , ఐజర్ వంటి విద్యాసంస్థల వల్ల ఎడ్యుకేషన్ హబ్ గా మారండం సంతోషం గావుందని అన్నారు.
ఈ సమావేశంలో కళాశాల సి ఇ ఓ డా.తిరుపతి ప్రాణిగ్రహి మాట్లాడుతూ ఉత్తమ సంస్థ నిర్మాణమే లక్ష్యంగా మంచి పేరు తెచ్చి మీమాట నిలబెట్టనున్నామని అన్నారు. గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్.పి.సిసోడియా , జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి, ప్రజా ప్రతినిధులు, వైద్య విద్యార్థులు వారి తల్లిదండ్రులు , అధికారులు పాల్గొన్నారు.