హైదరాబాద్ లో తన మొదటి స్టోర్ ను ప్రారంభించిన‌ మ్యాగ్నోలియా బేకరీ

భారతీయ మార్కెట్లో తన ఉనికి విస్తరించుకుంటున్న ప్రపంచ ప్రఖ్యాత బేకరీ

హైదరాబాద్

ఫుడ్ ల‌వ‌ర్స్ కోసం మ‌రో కొత్త దేశానికి చెందిన బేక‌రి అందుబాటులోకి వ‌చ్చింది. హైద‌రాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 లో మ్యాగ్నోలియా బేకరీ అందుబాటులోకి వ‌చ్చింది. కప్ కేక్స్, కేక్స్, పైస్, చీజ్ కేక్స్, ఐస్ బాక్స్ డెజర్ట్స్, కుకీస్, బనానా పుడింగ్ లతో పాటుగా తాజా బేక్డ్ డెజర్ట్స్ మంగోలియా బేక‌రి స్పెషాలిటీ. 1996లో న్యూయార్క్ నగరంలోని వెస్ట్ విలేజ్ లో మొదటగా ప్రారంభించబడిన ఈ బ్రాండ్ ప్రపంచంలోని ఆయా దేశాల్లోని ప్ర‌జ‌ల‌కు విభిన్న రుచుల‌ను అందిస్తోంది.

హైద‌రాబాద్ లో మొట్ట‌మొద‌టి మ్యాగ్నోలియా బేకరీ ప్రారంభించుకోవ‌డం త‌మ‌కెంతో సంతోషంగా ఉంద‌ని మంగోలియా ఇండియా ఫ్రాంచైజ్ స్పాగో ఫుడ్స్ పార్ట్ నర్ జోను రెడ్డి అన్నారు . భారతీయ మార్కెట్లో మా బ్రాండ్ ఉనికి పెంచుకునేందుకు ఇక్క‌డి స్టోర్ దోహ‌ద‌ప‌డుతుంద‌న్నారు .

హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో 3,000 చద‌ర‌పు అడుగుల‌ విస్తీర్ణంలో మ్యాగ్నోలియా బేకరీ ఏర్పాటైంది. థీమ్ అతిథులు ప్ర‌త్యేకంగా ఆక‌ర్షిస్తుంది . అతిథుల కోసం 23 టేబుళ్లలో ఎక్కడైనా తాజా బేక్డ్ డెజర్ట్ ను రుచి చూడవచ్చు. కప్ కేక్, కేక్ ఐసర్స్ మధుర రుచులను ఆస్వాదించవచ్చు. అందంగా అలంకరించిన కేక్స్, కప్ కేక్స్ రుచులను ఆనందించవచ్చు.

హైదరాబాద్ అనగానే గుర్తుకువచ్చే చార్మినార్, భారీ బుద్ధ విగ్రహంలతో పాటుగా న్యూయార్క్ స్ట్యాచూ ఆఫ్ లిబర్టీ, ఐకానిక్ ఎల్లో టాక్సీలు లతో సహా బ్రాండ్ ఐకానిక్ బనానా పుడింగ్, కప్ కేక్స్, కేక్ స్లైసెస్ వంటివి ఈ గోడపై చిత్రీకరించబడి ఉంటాయి. న్యూయార్క్ నగరానికి చెందిన రుచిని మంగోలియా బేకరీ ఏ విధంగా హైదరాబాద్ కు తీసుకువస్తున్నదో ఇది తెలియజేస్తుంది.

హైద‌రాబాద్ లో మ్యాగ్నోలియా బేకరీని ప్రారంభించుకోవ‌డం గొప్ప విష‌య‌మ‌ని స్పాగో ఫుడ్స్ పార్ట్ న‌ర్ నిశ్చ‌య్ జ‌య‌శంక‌ర్ అన్నారు . ఫుడ్స్, డ్రింక్స్, డెజర్ట్స్ అంటే భాగ్య‌న‌గ‌ర‌వాసుల‌కు ఎక్క‌వ ఇష్ట‌మ‌న్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *