ఆస్కార్ లో RRR పరిస్థితి ఎలా ఉందంటే…!
భారత సినీ వైభవాన్ని అంతర్జాతీయస్థాయిలో చాటిన చిత్రం RRR. ఇప్పుడీ చిత్రం ఆస్కారు నామినేట్ అవడం ద్వారా విశిష్ఠ గౌరవం దక్కించుకుంది. బెస్ట్ ఒరిజినల్ పాంగ్ కేటగిరీలో ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు పాట తుది జాబితాలో చోటు దక్కించుకుంది. ఆస్కార్ అవార్డుల కోసం ఇప్పటిదాకా 130 కేటగిరీల్లో నామినేషన్లు ప్రకటించారు. ఇంటర్నేషనల్ ఫీచర్, ఇంటర్నేషనల్ డాక్యుమెంటరీ ఫీచర్, డాక్యుమెంటరీ షార్ట్, సౌండ్, ఒరిజినల్ స్కోర్, ఒరిజినల్ సాంగ్, లైవ్ యాక్షన్ షార్ట్, మేకప్ అండ్ హెరిల్ స్టయిలింగ్, యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్, విజువల్ ఎఫెక్ట్స్ లో మాత్రమే తుది జాబితాలు ఖరారయ్యాయి. ఇక మిగిలింది 13 కేటరెరీలు.. బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ యాక్టర్, బెస్ట్ స్క్రీన్ ప్లే, బెస్ట్ స్టోరీ, బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్, బెస్ట్ సినిమాటోగ్రఫీ, బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్, యాక్టస్ తో పాటు ఇంకా కొన్ని కేటగిరీల్లో ఫైనల్ నామినేషన్లు ప్రకటించాల్సి ఉంది.
