ఉద్యోగుల ఆరోగ్యభద్రత కోసం హెల్త్ ఇన్సురెన్స్ కార్డులను అందజేసిన లిమౌసిస్
హైదరాబాద్ , మాదాపూర్
మహిళల కోసం షీ క్యాబ్స్ సర్వీసులు అందిస్తున్న లిమౌసిస్ సంస్థ …ఉద్యోగులకు ఇన్సురెన్స్ సౌకర్యం కల్పించింది .హైదరాబాద్ నోవాటెల్‌లో లిమౌసిస్ క్యాబ్ డ్రైవర్లకు ఇన్సురెన్స్ పత్రాలను సంస్థ ప్రతినిధులు అందించారు .
లిమౌసిస్ క్యాబ్ సర్వీస్ సంస్థ ఉద్యోగుల కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంస్థతో ఒప్పందం కుదుర్చుకుందని సంస్థ ఛైర్మెన్ అసద్ అహ్మద్ ఖాన్ తెలిపారు.లిమౌసిస్ ద్వారా చిన్న కార్ల నుంచి లగ్జరీ హైఎండ్ క్యాబ్ సర్వీసులను అందిస్తున్నామని… మహిళల భద్రత కోసం షీ క్యాబ్‌లను సైతం అందుబాటులో ఉంచామన్నారు . క్యాబ్‌లు నడిపే డ్రైవర్లకు , వారి కుటుంబ సభ్యులకు సైతం ఇన్సురెన్స్ సౌకర్యం కల్పించామన్నారు .
క్యూఆర్ కోడ్ ఉపయోగించి క్యాబ్ సర్వీసులను బుక్ చేసుకునే సౌకర్యం కల్పించడం శుభపరిణామమని సినీ నటి రాశీ అన్నారు. ఉద్యోగుల ఆరోగ్య భద్రత కోసం హెల్త్ ఇన్సురెన్స్ కార్డులను తన చేతుల మీదు అందించడం సంతోషంగా ఉందన్నారు. లిమౌసిస్ క్యాబ్ సర్వీస్ సంస్థ ఉద్యోగులతో పాటు కస్టమర్లకు ఇన్ టైంలో రీచ్ కావడం , బిజీ అవర్స్‌లో ఎక్కవ మొత్తం వసూలు చేయకపోవడం వంటి సౌకర్యాలు కల్పించేందుకు ముందుకు వచ్చిందన్నారు . అనంతరం అర్హులైన క్యాబ్ డ్రైవర్లకు హెల్త్ ఇన్సురెన్స్ కార్డులను అందజేశారు .