కృష్ణా విశ్వ విద్యాలయాన్ని హరిత నందనవనం చేద్దాం : మంత్రి పేర్ని నాని

మచిలీపట్నం :

పండ్ల మొక్కలతో పూల మొక్కలతో కృష్ణా విశ్వ విద్యాలయాన్ని హరిత నందనవనం చేద్దామని
మన ముందు తరాల వారికి మనమిచ్చే బహుమతి పచ్చని చెట్లేనని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) పిలుపు నిచ్చారు. మచిలీపట్నం శివారు రుద్రవరం సమీపంలోని కృష్ణా విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. యూనివర్సిటీలో తాగునీటి అవసరాల నిమిత్తం 60 లక్షల రూపాయల వ్యయంతో యూనివర్సిటీ గ్రాంటు ద్వారా ఏర్పరిచిన పైప్ లైన్ ప్రారంభోత్సవ ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, కృష్ణా విశ్వ విద్యాలయాన్ని పండ్ల మొక్కల తో పూలమొక్కలతో హరిత నందనవనం చేద్దామని అన్నారు. కృష్ణా యూనివర్సిటీ దివంగత ముఖ్యమంత్రి మహా నేత డాక్టర్ వై ఎస్ రాజశేఖర రెడ్డి ఆశీస్సులతో మచిలీపట్నంలో ఏర్పడిందన్నారు. మచిలీపట్నానికి చివరి ప్రాంతంలో ఏర్పడిన కృష్ణా విశ్వ విద్యాలయంకు పలు సమస్యలు స్వాగతం పలికేయని చెబుతూ, నూతన వ్యవస్థ ఏర్పడినప్పుడు వివిధ ఇబ్బందులు ఏర్పడటం సహజమేనని చెప్పారు. విశ్వవిద్యాలయానికి తాగునీరు సరఫరా చేయడం మచిలీపట్నం నగరపాలక సంస్థ ముఖ్య బాధ్యత అని అన్నారు. గతమెంతో ఘన చరిత్ర ఉన్న మచిలీపట్నంకు పూర్వ వైభవం తీసుకురావాలంటే విద్య వైద్యం రవాణా ఎంతో కీలకాంశాలని చెప్పారు. ప్రస్తుత కాలంలో కృష్ణా యూనివర్సిటీ , మెడికల్ కళాశాల, మచిలీపట్నం పోర్టు నిర్మాణం తదితర అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభమై ఈ ప్రాంత కీర్తిని ఎలుగెత్తి చాటుతాయని అని అన్నారు. విద్యార్థినీ విద్యార్థులు, అధ్యాపక సిబ్బంది, వైస్ ఛాన్సలర్ , రిజిస్ట్రర్ అనేక సమస్యలను ఎదుర్కొంటూ, విశ్వవిద్యాలయాన్ని వృద్ధి చేయాలనీ మంత్రి కోరారు. ఆంధ్రా విశ్వవిద్యాలయం, జె ఎన్ టి యు మాదిరిగా అభివృద్ధిపర్చాలని కోరారు. ఈ యూనివర్సిటీ ఏర్పడేందుకు ప్రధాన కారకులైన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై ఎస్ రాజశేఖరరెడ్డి స్మరించుకొనేందుకు ఆయన విగ్రహాన్ని వైస్ ఛాన్సలర్ ఏర్పాటుచేశారని త్వరలోనే ఆ కార్యక్రమం జరుగుతుందన్నారు. అలాగే విశ్వవిద్యాలయ ప్రాంగణంలో అవెన్యూ ప్లాంటేషన్ జరిగేలా యోచన చేశామని, యూనివర్సిటీ ముందు భాగంలో పండ్ల మొక్కలను పెట్టాలని నిర్ణయం తీసుకున్నామని ఒక్కో విద్యార్థికి మూడు మొక్కలు కేటాయించి అవి బలంగా నేలలో వేళ్లూని చెట్లుగా నిలదొక్కుకొనేవరకు ఆ బాధ్యత వారిదేనని ఆ మొక్కలను బతికించిన విద్యార్థినీ విద్యార్థుల పేర్లు ఆయా మొక్కలకు కు కు పెడదామని తానూ, వైస్ ఛాన్సలర్ , రిజిస్ట్రార్ ఆలోచన చేశామని త్వరలోనే ఆ కార్యక్రమం కార్యాచరణ దశకు చేరుకోనున్నట్లు మంత్రి పేర్ని నాని ప్రకటించారు.
అనంతరం మచిలీపట్నం నగరపాలక సంస్థ మేయర్ మోకా వెంకటేశ్వరమ్మ మాట్లాడుతూ, కృష్ణా విశ్వవిద్యాలయంకు తాగునీటి ఇక్కట్లు ఇక తొలగిపోనున్నట్లు తాను ఆశాభావం వ్యక్తం చేస్తున్నానని అన్నారు.
ఈ కార్యక్రమంలో కృష్ణా విశ్వ విద్యాలయం వైస్ ఛాన్సలర్ కె. బి. చంద్రశేఖర్ , ప్రిన్సిపాల్ డి. సూర్యచంద్రరావు, రిజిస్ట్రార్ వై కె సుందర కృష్ణ, డిప్యూటీ మేయర్లు తంటిపూడి కవిత, లంకా సూరిబాబు, నగరపాలక సంస్థ కమీషనర్ కె. శివరామకృష్ణ, మచిలీపట్నం మార్కెట్ యార్డ్ ఛైర్మెన్ షేక్ ముస్తఫా ( అచ్చాబా ), మచిలీపట్నం మాజీ మునిసిపల్ ఛైర్మెన్ షేక్ సలార్ దాదా, అర్బన్ బ్యాంకు మాజీ ఛైర్మెన్ బొర్రా విఠల్ పలువురు కార్పొరేటర్లు , విశ్వవిద్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *