హైదరాబాద్‌లో లీడ్ ఛాంపియన్ షిప్ 2022 ఫైనల్స్ పోటీలు: విజేతలకు బహుమతుల ప్రధానం
హైదరాబాద్
భారతదేశపు అతిపెద్ద స్కూల్ ఎడ్‌టెక్ కంపెనీ లీడ్..హైదరాబాద్ ద పార్క్ హోటల్‌లో లీడ్ చాంఫియన్‌షిప్ 2022 ఫైనల్స్ పోటీలను నిర్వహించి విజేతలను ప్రకటించింది. లీడ్ చాంఫియన్‌షిప్ 2022 పోటీలను భారతదేశ వ్యాప్తంగా 3000కు లీడ్ భాగస్వామ్య స్కూల్స్‌లోని 1.2 మిలియన్‌ల 9వ తరగతి లోపు ప్రీ ప్రైమరీ స్కూల్ విద్యార్థులకు నిర్వహించారు.

లీడ్ చాంఫియన్‌షిప్ 2022 విజేతలకు లీడ్ కో–ఫౌండర్ , సీఈఓ సుమీత్ మెహతా హృదయపూర్వకంగా అభినందనలు తెలిపారు.దేశవ్యాప్తంగా వేలాది మంది విద్యార్దులతో పోటీపడి విజయం సాధించడం సాధారణ అంశమేమీ కాదన్నారు. మరీ ముఖ్యంగా చిన్న పట్టణాల విద్యార్ధులు అంకిత భావం, నమ్మకం, కష్టం, సహజసిద్ధమైన ప్రతిభకు ఈ చాంఫియన్‌షిప్ నిదర్శనంగా నిలుస్తుందన్నారు. లీడ్ విద్యార్ధుల సమగ్ర అభివృద్ధి ప్రయాణంలో భాగం కావడం గౌరవంగా భావిస్తున్నామన్నారు .

లీడ్ చాంఫియన్‌షిప్ 2022 లో విజేతగా నిలవడం ఆనందంగా ఉందని విద్యార్థులు తెలిపారు. మా టీచర్ల మద్దతు, మార్గనిర్దేశనం కారణంగానే ఈ విజయం సాధ్యమైందన్నారు. ఈ చాంఫియన్‌షిప్ కు సిద్ధం కావడం వల్ల మరింతగా కాన్సెప్ట్స్‌ను అర్ధం చేసుకోగలిగామని… అలాగే ఎలా మాట్లాడాలి, సృజనాత్మక నైపుణ్యాలను ఎలా మెరుగుపరుచుకోవాలో తెలుసుకున్నామన్నారు.
లీడ్ చాంఫియన్‌షిప్ 2022 విజేతలకు 10 లక్షల రూపాయలకు పైగా విలువైన బహుమతులు అందించినట్లు లీడ్ కో ఫౌండర్ సుమీత్ తెలిపారు. విజేతలకు ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు, బ్యాగ్స్ …లీడ్ చాంఫియన్‌షిప్ ట్రోఫీ అందించామన్నారు. దాదాపు 8 వేల మంది విద్యార్థులకు డిజిటల్ పార్టిసిపేషన్ సర్టిఫికెట్లను సైతం అందించామని వివరించారు .