బహార్ బిర్యానీ కెఫ్ రెస్టారెంట్‌ను ప్రారంభించిన వకీల్ సాబ్ ఫేం అనన్య నాగేళ్ళ
భాగ్యనగరంలో సినీ నటి అనన్య నాగేళ్ళ సందడి చేశారు .హైదరాబాద్ చందానగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన బహార్ బిర్యానీ కేఫ్ రెస్టారెంట్ ను అనన్య నాగేళ్ళ ప్రారంభించారు.
తాను వెజిటేరియన్ నని … పన్నీర్ బిర్యానీ, వెజిటెబుల్ కబాబ్స్ అంటే ఇష్టమని చెబుతోంది.
హైదరాబాదీయులకు గత పదేళ్ళుగా బెస్ట్ బిర్యానీలను అందిస్తున్నామని బహార్ బిర్యానీ కేఫ్ ఫౌండర్ శ్రీకాంత్ మన్యాల తెలిపారు. 2012 లో హస్తినాపురంలో మొదటి బ్రాంచ్ ప్రారంభించామన్నారు. హైదరాబాద్ చందానగర్ లో వివా రాఘవ్, మధులిక, అపర్ణ మాధురిలు శ్రీకాంత్‌తో భాగస్వాములై కొత్త రెస్టారెంట్ ను ఏర్పాటు చేశారు .
చందానగర్ బ్రాంచ్‌తో మొదలుపెట్టి మరిన్ని ఫ్రాంచైజ్‌లు త్వరలో మొదలు పెడతామని రాఘవ్ ,మధులికలు తెలిపారు . నాణ్యతతో కూడిన వెజ్ ,నాన్ వెజ్ వంటకాలు అందిస్తున్నామన్నారు. అరబిక్ థీమ్ తో రూపొందించిన ఈ రెస్టారెంట్ యాంబియన్స్ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. హాలిడేస్ ,వీకెండ్స్ లో అన్ లిమిటెడ్ బఫేలు అందిస్తున్నట్లు నిర్వహకులు తెలిపారు. ఇండియన్‌తో పాటు చైనీస్, తందూర్, మండి 180కి పైగా డిషెస్ మెనూలో అందిస్తున్నామని తెలిపారు.