రబీంద్రనాథ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత టీ , బిస్కెట్ సెంటర్ ప్రారంభం

రబీంద్రనాథ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత టీ , బిస్కెట్ సెంటర్ ప్రారంభం

హైదరాబాద్, మాసబ్ ట్యాంక్

హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ మహవీర్ ఆసుపత్రికి సమీపంలో ఉచిత టీ , బిస్కెట్ కౌంటర్ ను సంస్థ ప్రతినిధులు ప్రారంభించారు. రబీంద్రనాథ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఐఎక్సోరా గ్రూప్, కడక్ హౌస్ సంయుక్తంగా కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద పేదల ఆకలి తీర్చేందుకు తమ వంతు సాయం అందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.మంత్రి కేటీఆర్ బర్త్ డేను పురస్కరించుకుని గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం కింద పేదలకు ,రోగుల సహాయకులకు ప్రయాణీకులకు ఉచిత టీ, బిస్కట్ అందిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్ బంజారాహిల్స్ కెబిఆర్ పార్క్ వద్ద ఏర్పాటు చేసిన ఉచిత బిస్కెట్ కౌంటర్కు కౌంటర్లో ప్రతిరోజు 1500 మందికి పైగా టీ బిస్కెట్లు అందిస్తున్నట్లు వారు తెలిపారు.త్వరలో ఇలాంటి కౌంటర్లు మరిన్ని ఏర్పాటు చేసి పేదల ఆకలి తీర్చేందుకు తమ వంతు కృషి చేస్తామని చక్రవర్తి తెలిపారు . మంత్రి కేటీఆర్ బర్త్ డే ని పురస్కరించుకుని గిఫ్ట్ స్మైల్ కార్యక్రమంలో భాగంగా ఉచితంగా టీ ,బిస్కెట్ సెంటర్ ను ఏర్పాటు చేశామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *