హైదరాబాద్ కొండాపూర్ లో మంచి బఫే పేరుతో అతిపెద్ద మల్టీ క్యుజెన్ రెస్టారెంట్ ప్రారంభం
హైదరాబాద్ కొండాపూర్ లో మంచి బఫే పేరుతో అతిపెద్ద మల్టీ క్యుజెన్ రెస్టారెంట్ ప్రారంభం
హైదరాబాద్, కొండాపూర్
విభిన్న రుచులు కోరుకునే భాగ్యనగరవాసులకు దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద మల్టీ క్యూజెన్ బఫె రెస్టారెంట్ అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్ కొండాపూర్‌లో మంచి బఫే పేరుతో ఏర్పాటు చేసిన ఈ రెస్టారెంట్‌లో ఇండియన్ ,వెస్ట్రన్ , చైనీస్ , కాంటినెంటల్ తదితర రెండు వందల రకాల ఫుడ్ ఐటమ్స్‌ను అందిస్తున్నట్లు సంస్థ వ్యవస్థాపకులు అనిల్ కుమార్ తెలిపారు . రుచికరమైన వంటకాలను అందిస్తోంది ఈ రెస్టారెంట్ .
భారతీయ విదేశీ వంటకాల రుచులను అందించేందుకు మంచి బఫే రెస్టారెంట్ ముందుకు వచ్చింది .హైదరాబాద్ కొండాపూర్ సాహితీ సుధా స్వ్కైర్ మాల్‌లో ఏర్పాటు చేసిన ఈ రెస్టారెంట్‌ను మంచి బఫే ఫౌండర్ అనిల్ కుమార్ పామర్తి ప్రారంభించారు.
మెనులో వెల్ కమ్ డ్రింక్స్ నుంచి మొదలుకుని రెండు వందలకుపైగా నోరూరించే వంటకాలు , 16 లైవ్ కౌంటర్లు, పానీపూరి, చెరకు రసంతో పాటు పాన్‌లను సైతం అందిస్తున్నట్లు నిర్వహకులు తెలిపారు .
అన్ని రకాల వర్గాల ప్రజల అభిరుచులకు అనుగుణంగా , ఎంబీలో అల్ టైం ఫెవరేటర్స్ ,పాప్ కార్న్, క్యాండీ ప్లోస్, పాస్తా, రోల్డ్ ఆఫ్ ఐస్ క్రీమ్‌లను అందుబాటులో ఉంచారు. చిన్నారుల కోసం కిడ్స్ ప్లే ఏరియాను సైతం ఏర్పాటు చేశారు .
మంచి బఫే 12వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో సువిశాలంగా నిర్మించారు. పుట్టిన రోజు మొదలుకుని అన్ని రకాల పార్టీలు, కార్పోరేట్ ఈవెంట్లు జరుపుకునేలా ఏర్పాట్లు చేశారు. సుమారు 200 మంది ఒకేసారి కుర్చొని తినేలా బాంక్వెట్ హాల్‌ను ఏర్పాటు చేశారు .
మంచి బఫే అనేది కుటుంబాలను ఒకే డిన్నర్ టేబుల్‌పై కలపాలనే తన ఆలోచనలలతో రూపొందించబడిందని మంచి బఫె వ్యవస్థాపకులు అనిల్ కుమార్ పామర్తి తెలిపారు .మొత్తం కుటుంబం కలిసి రోజుకు కనీసం ఒకసారైనా భోజనం చేయాలనే ఈ రెస్టారెంట్‌ను ఏర్పాటు చేశామన్నారు .వసుదేవ కుటుంబం వాస్తవికతను అచరణకు తీసుకురావడానికి మంచి బఫే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.స్నేహితులు , కుటుంబ సభ్యులు, సహచరులతో కలిసి రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదించేందుకు ఈ రెస్టారెంట్ చక్కటి వేదిక అవుతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు .