హాట్ కేక్ గా అమ్ముడుపోయిన ల్యాండ్ పార్సెల్స్

ఎం.ఎస్.టి.సి ఆధ్వర్యంలో ఆన్ లైన్ వేలంలో పోటా పోటీ

రంగారెడ్డి జిల్లాలో మూడు, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో నాలుగు, సంగారెడ్డి జిల్లాలో రెండు ల్యాండ్ పార్సిల్స్ విక్రయం

అత్యధికంగా గజం రూ.1,11,000లు

9 ల్యాండ్ పార్సెల్ విక్రయాల ద్వారా రూ.195.24 కోట్ల రెవెన్యూ

హైదరాబాద్ : హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ ( హెచ్ఎండిఏ) ల్యాండ్ పార్సెల్ ఆన్లైన్ వేలం ప్రక్రియకు మంచి ఆదరణ లభించింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎం.ఎస్.టి.సి బుధవారం నిర్వహించిన ఆన్ లైన్ వేలంలో రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లా పరిధిలోని 9 ల్యాండ్ పార్సెల్ ను (ఆన్ లైన్ ఈ – అక్షన్) ద్వారా విక్రయాల ద్వారా రూ.195.24 కోట్ల రెవెన్యూ వచ్చింది.

రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ల్యాండ్ పార్సెల్ కొనుగోలుకు ఆసక్తి కనబరచడం వల్ల అత్యధికంగా గజం లక్ష 11 వేల రూపాయలు ధర పలికింది.

రెండవ దశ ల్యాండ్ పార్సిల్స్ అమ్మకాలకు మరో మూడు రోజుల తర్వాత నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు హెచ్ఎండిఏ తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *