చేనేత కార్మికులకు చేయూత అందించాలి : కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
హైదరాబాద్
మోతీనగర్
చేనేత కార్మికులకు చేయూతను అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. కళాకారులు తయారు చేసిన వస్త్ర ఉత్పత్తులు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయన్నారు. హైదరాబాద్ మోతీనగర్ కమ్యూనిటీ హాల్ లో ఆల్ఇండియా హ్యాండ్లూమ్ హ్యాండీక్రాఫ్ట్ వస్త్ర ప్రదర్శనను ఆయన ప్రారంభించారు .
ఆషాడ బోనాలు,వర్షాకాలంతో పాటు అన్ని సీజన్లలో ధరించడానికి అనుకూలంగా ఉండే సిల్క్ ,కాటన్ వస్త్రాలు అందుబాటులో ఉంచినట్లు నిర్వహకులు గంగాధర్ తెలిపారు . పండుగలు , పెళ్ళిళ్ళ సీజన్ ను దఈష్టిలో ఉంచుకుని అన్ని రకాల వస్త్ర ఉత్పత్తుల కొనుగోలుపై 30 శాతం డిస్కౌంట్ అందిస్తున్నట్లు నిర్వహకులు గంగాధర్ తెలిపారు .
ఆల్ ఇండియా హ్యండ్లూమ్స్ , హ్యండీక్రాఫ్ట్ వ స్త్ర ప్రదర్శన ఈ నెలాఖరు వరకు కొనసాగుతుంది.
” ఆషాడం మరియు మాన్సున్ ప్రత్యేక కలెక్షన్స్ వస్త్ర ప్రదర్శన”లో సరికొత్త ఫ్యాషన్ ట్రైండ్స్ తో ఉప్పాడ, కళంకారీ, మంగళగిరి, వెంకటగిరి, పోచంపల్లి చీరలు, చందేరి సిల్క్ , రాజస్థాన్ కాటన్ చీరలు, హ్యాండ్ బ్లాక్ ప్రింట్ చీరలు, భాగల్పూర్ సిల్క్ చీరలు, బెంగాల్ కాటన్ చీరలు, కాశ్మీర్ సిల్క్ చీరలు, లక్నోచికన్ చీరలు, బనారస్ చీరలు, కాంతా వర్క్ చీరలు, డిజైనర్ సూట్స్, బ్లవుజులు, టాప్స్, జైపూర్ బెడ్ షీట్లు, జైపూర్ బ్లాక్ గాజులు, స్టొన్ జువెలరీ తదితర ఉత్పత్తులు లభిస్తాయని నిర్వహకులు అక్బర్ అలీపేర్కొన్నారు.
ఈ ఎగ్జిబిషన్ ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9:30 గంటల వరకు కొనసాగుతుంది