తెలంగాణలో విస్తరించిన కోన్‌ (KONE)ఇండియా.. క‌స్ట‌మ‌ర్ల‌తో క‌నెక్ట్ అయ్యేందుకు హైదరాబాద్ కే పీ హెచ్ బీ లో నూతన కార్యక్రమం ప్రారంభం

వినియోగదారులకు 110 సంవత్స‌రాలుపైగా అత్యుత్తమ సేవ‌ల‌ను, అనుభవాలను అందించిన కోన్ ఇండియా ..

స‌రికొత్త స్మార్ట్ ఎలివేట‌ర్ల రూప‌క‌ల్ప‌న … 24/7 కనెక్టడ్‌ సేవలతో విప్లవాత్మక ఆవిష్కరణలు

మెరుగైన పర్యావరణ సామర్థ్యం ద్వారా సస్టెయినబల్‌ స్మార్ట్‌ సిటీస్‌ మిషన్‌కు మద్దతు

హైదరాబాద్‌, ఫిబ్రవరి 10,2022 :

కోన్‌ కార్పోరేషన్ అనుబంధ సంస్థ అయిన కోన్‌ ఎలివేటర్‌ ఇండియా తెలంగాణలో త‌న నూత‌న‌ కార్యాల‌యం ఏర్పాటు చేసిన‌ట్లు కోన్ ఎలివేట‌ర్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్ట‌ర్ అమిత్ గోస్సైన్ తెలిపారు. వినియోగ‌దారుల‌కు మెరుగైన సేవ‌లు అందించేందుకు….ప‌రిశ్ర‌మలో అవిష్క‌ర‌ణ‌ల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రించేందుకు ఈ కేంద్రం దోహ‌ద‌ప‌డుతుంద‌న్నారు. ఎలివేట‌ర్స్ రంగంలో అగ్రగామిగా తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవాల‌నే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామ‌న్నారు. గ‌త కొన్ని సంవ‌త్స‌రాలుగా భారతదేశంలో భారీ పెట్టుబడుల కారణంగా త‌మ కోన్ ఇండియా ఉత్ప‌త్తుల‌ను మార్కెట్ అవ‌స‌రాల‌కు అనుగుణంగా అంతర్జాతీయ వ్యూహంలో ముందుకువెళ్తున్న‌ట్లు అమిత్ తెలిపారు .

హైద‌రాబాద్ కూకట్‌పల్లి హౌసింగ్‌ బోర్డ్‌ కాలనీలో త‌మ కార్పోరేట్ కార్యాల‌యం ఏర్పాటు చేశామ‌ని అమిత్ గోస్సైన్ వివ‌రించారు . ఈ కేంద్రం ద్వారా అమ్మకాలు, ఇన్‌స్టాలేషన్స్‌, సేవలు, ఏఎంసీ , ఆధునీకరణకు తోడ్పడటంతో పాటుగా వినియోగదారులకు అసాధారణ విలువను సైతం అందించనుంద‌ని తెలిపారు.

దేశంలోనే తెలంగాణ రాష్ట్రం శ‌ర వేగంగా అభివృద్ధి చెందుతుంద‌ని… ప్రభుత్వ నిర్ణ‌యాల ప‌ట్ల తాము సంతోషంగా ఉన్నామ‌ని తెలిపారు. స్మార్ట్ సిటీల నిర్మాణం పెరిగిపోతున్న త‌రుణంలో అందుకు అనుగుణంగా సాంకేతిక ఆవిష్క‌ర‌ణ‌లు తీసుకువ‌స్తున్న‌ట్లు ఆయ‌న తెలిపారు .

ఎలివేటర్ ,ఎస్కలేటర్‌ పరిశ్రమలో అంతర్జాతీయంగా సుప్రసిద్ధ సంస్ధ కోన్ ఇండియాను … ఫోర్బ్స్‌ సంస్ధ ఎనిమిది సార్లు ప్రపంచంలో అత్యంత సృజనాత్మక కంపెనీలలో ఒకటిగా దీనిని గుర్తించిందన్నారు. దీని ఆవిష్కరణ పద్ధతులు కారణంగా తమ వినియోగదారులతో సహసృష్టికి అనుమతించడంతో పాటుగా కోన్ పరిశోధన,నూతన ఉత్పత్తులు, సేవల సృష్టిలో అత్యంత కీలకంగానూ మారాయ‌న్నారు. నూతన ఇంటిగ్రేటెడ్‌ సాంకేతికతలను, కనెక్టివిటీ వినియోగిస్తున్నామ‌న్నారు.

కోన్‌ 24/7 కనెక్టడ్‌ సేవలు అత్యంత కీలకంగా నిలిచాయని అమిత్ తెలిపారు. ప్ర‌పంచంలోనే మొట్ట‌మొద‌టి సారిగా డిజిటల్ కనెక్టడ్‌ ఎలివేటర్ల త‌యారు చేశామ‌ని …కోన్‌ డీఎక్స్‌ క్లాస్‌ ఎలివేటర్ల పరంగా కృత్రిమ మేథస్సు తీసుకువచ్చిందన్నారు. 24 అంత‌స్తుల వర‌కు ఎలివిట‌ర్లు, వంద టన్నుల బ‌రువును పైకి తీసుకువెళ్ళే క‌న్ స్ట్ర‌క్ష‌న్ ఎలివేట‌ర్లుకు దేశ వ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంద‌న్నారు .స్మార్ట్ సిటీలు ,స్మార్ట్ హోంల కోసం సెల్ ఫోన్ తో ఆప‌రేట్ చేసుకునేలా … న‌చ్చిన లైటింగ్ మ్యూజిక్ ను ఎంపిక చేసుకునేలా స్మార్ట్ ఎలివేట‌ర్ ను తీసుకువ‌చ్చామ‌న్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *