కొల్లూరు 2 bhk గృహ సముదాయం అద్బుతం- హౌసింగ్ మరియు పట్టణ వ్యవహారాల స్టాండింగ్ కమిటీ

హైదరాబాద్

హౌసింగ్ మరియు పట్టణ వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఈరోజు శనివారం నాడు కొల్లూరులో పర్యటించి 2BHK డిగ్నిటీ హౌసింగ్ ప్రాజెక్ట్‌ను పరిశీలించింది. రాజీవ్ రంజన్ సింగ్ అధ్యక్షతన గల కమిటీ రాజ్యసభ మరియు లోక్‌సభ సభ్యులతో ఏర్పడిన కమిటీ తెలంగాణ లో అమలు చేస్తున్న 2 bhk పథకం అమలు తీరును అధ్యయనం చేయడానికి హైదారాబాద్ కు వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డిగ్నిటీ హౌసింగ్‌ పథకం గురించి మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ కమిషనర్‌ డాక్టర్ ఎన్‌ సత్యనారాయణ కమిటీ సభ్యులకు వివరించారు. భారత ప్రభుత్వం యొక్క PMAY (అర్బన్) పథకం ద్వారా దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న తక్కువ పేద ప్రజలకు ఆశ్రయం కల్పించడానికి తెలంగాణ ప్రభుత్వం కొల్లూరులో 15660 2BHK గృహాలు నిర్మించారు. పేదలు ఆత్మ గౌరవం తో బ్రతుకాల నే ఉద్దేశ్యం తో లబ్ధిదారులకు ఉచితంగా అందిస్తున్నారు. ఈ పథకం లో ఒక ఇంటి యూనిట్ ధర రూ. 6.05 లక్షల రూపాయలు ఇందులో మౌలిక సదుపాయాల ఖర్చు రూ.75 వేలు. భారత ప్రభుత్వ వాటా రూ.1.50 లక్షలు కాగా రాష్ట్ర వాటా రూ.4.55 లక్షలులని వివరించారు .


ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు విజన్‌ ​​మేరకు రెండు పడక గదుల ఇళ్లను లబ్ధిదారులకు ఉచితంగా అందజేస్తున్నట్లు కమిటీ సభ్యులకు తెలియజేశారు. రాష్ట్రంలో ఈ కార్యక్రమం అమలు తీరును కమిటీ సభ్యులు అడిగి తెలుసుకుని ఇంత బృహత్తర గృహ నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టినందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించారు. కమిటీ సభ్యులు గృహ సముదాయాల చుట్టూ తిరిగి ఫ్లాట్లను పరిశీలించారు. నిర్వహణ ఖర్చులను భరించేందుకు ఆదాయ ఉత్పత్తికి వినూత్న చర్యలు చేపట్టడాన్ని సభ్యులు అభినందించారు.
సంగారెడ్డి కలెక్టర్‌ శరత్‌, రంగారెడ్డి కలెక్టర్‌ అమోయ్‌కుమార్‌, జీహెచ్‌ఎంసీ అడిషనల్ కమిషనర్ లు సంతోష్, ప్రియాంక అలా హౌసింగ్ అధికారి సురేష్ కుమార్,రెవెన్యూ, పోలీసు శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *