పర్యాటక రంగానికి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు కృషి చేస్తా కిషన్ రెడ్డి

హైదరాబాద్,ఫిలింనగర్

విమానయాన ప్రయాణాలను తిరిగి ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించినట్లు కేంద్ర టూరిజం శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు .హైదరాబాద్ ఫిలింనగర్‌లో క్యూబా డ్రైవ్‌ ఇన్‌లో ద ఫిష్ బైట్ పేరుతో ఏర్పాటు చేసిన రెస్టారెంట్‌ను ఆయన ప్రారంభించారు.దేశంలో కరోనా అదుపులో ఉన్న నేపథ్యంలో పర్యాటకరంగం మరింత వేగంగా పుంజుకునే అవకాశాలు ఉన్నాయన్నారు .రేపు ఇంటర్నేషనల్ టూరిజం డేను పురస్కరించుకుని టూరిస్ట్‌ల కోసం ప్రత్యేక పాలసీలను తీసుకువస్తున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లో టూరిజం స్పాట్లు ఏర్పాటు చేసి పర్యాటక రంగ అభివృద్దికి కృషి చేస్తామన్నారు .

12 ఏళ్ల పైబడి చిన్నారులకు సైతం కేంద్ర ప్రభుత్వం కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తుందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు . ఇందుకోసం ఇప్పటికే ఉత్పత్తిని ప్రారంభించామన్నారు . కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి రావడంతో పాటు పెద్ద ఎత్తు వ్యాక్సిన్‌ డ్రైవ్‌ నిర్వహించడం వలన దేశంలో ప్రజలకు నమ్మకం ఏర్పడిందన్నారు. కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా పర్యాటక రంగం తీవ్రంగా నష్టపోయిందని కిషన్‌రెడ్డి అన్నారు. దేశంలో పర్యాటక రంగానికి తిరిగి పూర్వ వైభవం తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. హైదరాబాద్ లో హోటల్స్‌,రెస్టారెంట్స్ లలో ఇప్పడిప్పుడే అక్యుపెన్సీ రేటు పెరుగుతుందన్నారు .కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రజల్లో జీవన విధానంలో అనేక మార్పులు వచ్చాయని…ఆరోగ్యం, ఆహారంపై అవగాహన రావడంతో పాటు శ్రద్ధ చూపుతున్నారని ఆయన పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్‌తోపాటు మాజీ ఎమ్మెల్యే చింతాల రామంద్రారెడ్డి, జాతీయ బీసి మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్‌ స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *