చిల్లిపల్లి ద వింటేజ్ వీవర్స్ …షోరూంను ప్రారంభించిన కిలాడీ మూవీ ఫేం డింపుల్ హాయాతి
హైదరాబాద్ , మదీనాగూడ
భారతీయ సంస్కృతి ,సాంప్రదాయాలను ప్రతిబింబించేలా చేతితో తయారు చేసిన చిల్లపల్లి సిల్క్ చీరలను అందరూ ఆదరించాలని కిలాడీ మూవీ ఫేం డింపుల్ హాయాతి అన్నారు. హైదరాబాద్ మదీనా గూడలో చిల్లపల్లి ద వింటేజ్ వీవర్స్ షోరూంను నిర్వహకులతో కలిసి ఆమె ప్రారంభించారు.
గత ఐదు దశాబ్దాలుగా తెలుగు రాష్ట్రాల్లోని మహిళలకు పట్టు చీరలు , ఫ్యాన్సీ చీరల అందిస్తున్న చిల్లిపల్లి ద వింటేజ్ వీవర్స్ ను తెలంగాణలో విస్తరిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే బంజారాహిల్స్ లో ఒక షోరూంను ప్రారంభించామని …మదీనాగూడలో రెండో షోరూంను ఏర్పాటు చేశామన్నారు. సిల్క్, కాటన్ వస్త్రాలతో పాటు ఆర్గానిక్ కలర్స్ తో తయారు చేసిన నేత వస్త్రాలను వీలైనంత తక్కువ ధరలకు అందిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్ లో హైదరాబాద్ లో మరిన్ని ప్రాంతాల్లో కొత్త షోరూంలు అందుబాటులో కి తీసుకు వస్తామన్నారు