కాంగ్రెస్ పార్టీ చేపట్టిన విద్యార్థి,నిరుద్యోగ జంగ్ సైరన్‌ను పోలీసులు అడ్డుకోవడం అన్యాయం – ఖైరతాబాద్ మాజీ కార్పోరేటర్ రాజు యాదవ్
హైదరాబాద్, సోమాజీగూడ
కాంగ్రెస్ పార్టీ చేపట్టిన విద్యార్థి, నిరుద్యోగ జంగ్ సైరన్‌ను పోలీసులు అడ్డుకోవడం అన్యాయమని ఖైరతాబాద్ మాజీ కార్పోరేటర్ రాజు యాదవ్ విమర్శించారు .హైదరాబాద్ సోమాజీగూడలోని జయ గార్డెన్స్‌లో ఖైరతాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు .
ఖైరతాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని రాజు యాదవ్ పిలుపునిచ్చారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నాయకత్వంలో తిరిగి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు ప్రతి కార్యకర్త అహర్నిశలు పాటు పడాలన్నారు .నియోజకవర్గంలో ప్రతి రెండు వారాలకు ఒక డివిజన్ చొప్పన ప్రతి డివిజన్‌లో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తామన్నారు .బస్తీలు ,కాలనీల్లోని సమస్యలపై త్వరలో కార్యచరణ ప్రణాళిక రూపొందించి అధికార పార్టీపై నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు .స్వార్థ రాజకీయాల కోసం కొంత మంది పార్టీని వీడి … కాంగ్రెస్ పార్టీపైనే విమర్శలు చేస్తున్నారని రాజు యాదవ్ ఆరోపించారు. దేశంలో ,రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు .