హైదరాబాద్ అమీర్ పేట్ ఆదిత్య పార్క్ హోటల్ లో కేరళ ఫుడ్ ఫెస్టివల్

భోజన ప్రియుల కోసం అమీర్‌పేటలోని ఆదిత్య పార్క్‌ హోటల్‌ ప్రత్యేక ఆహారోత్సవం నిర్వహిస్తోంది.  ఓనం పండుగ సందర్భంగా ఓనం సద్య పేరిట ఏర్పాటు చేసిన కేరళ పుడ్‌ ఫెస్టివల్‌ నోరూరిస్తోంది.

మూడు రోజుల పాటు నిర్వహించే ఈ ఆహారోత్సవంలో దాదాపు 24 రకాలైన వంటకాలను అందిస్తున్నట్లు ఆదిత్య పార్క్‌ హోటల్‌ మాస్టర్‌ చెఫ్‌ శ్రీనివాస్‌ తెలిపారు.

ఇందులో రుచికరమైన వంటకాలు ముఖ్యంగా కేరళకు చెందిన వాజై అప్పర్, సర్కార వరాట్, పులి ఇంజి, కడు మంగ, నిరంగ అచార్, మధుర కర్రి, వెల్లారి పచ్చడి, పజమ్ నురుక్కు,
కేరళ పాపడ్, బనానా, పయారు థోరన్, అవియల్, కాలన్, ఓలన్, కూటు కర్రి, కైథా చక్కా పుసిశ్శెరి, నీ పరుప్పు, సాంబార్, రసం, సంబరమ్, అడ్ ప్రధమన్, చెరుపాయర్ ప్రధమన్ వంటి వెజిటేరియన్ వంటకాలలను అందిస్తున్నట్లు చెప్పారు.

ఇలా తయారు చేసిన కేరళ భోజనాన్ని సాంప్రదాయ పద్దతిలో అరటిఆకు పై అందించడం తమ ప్రత్యేకత అని చెఫ్ శ్రీనివాస్ తెలిపారు.
ఆగస్ట్ 21 వ తేదీ నుంచి 23 వ తేదీ వరకు అద్య కేరళ ఫుడ్ ఫెస్టివల్ కొనసాగుతుంది.

ఆదిత్య పార్క్ కు చెందిన F&B మేనేజర్  రాజా మాట్లాడుతూ దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన రుచులను గెస్టులకు అందించే లక్ష్యంతో ఈ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నామని చెప్పారు.  ప్రతి వ్యక్తికి కేవలం 499 రూపాయల (ట్యాక్స్ లు అదనం) లకే ఈ భోజనం అందిస్తున్నట్లు  తెలిపారు.  భోజన వేళలలో అందించే రుచులకు అనుగుణంగా కేరళ ను గుర్తుకు తెచ్చేలా రెస్టారెంట్ ను  తీర్చిదిద్దామని తెలిపారు .గాడ్స్ ఓన్ కంట్రీగా ప్రఖ్యాతి గాంచిన కేరళ కు చెందిన ప్రత్యేకమైన రుచులను ఆస్వాదించాలనుకునే భోజన ప్రియులను రెస్టారెంట్ సాదరంగా ఈ ఫుడ్ ఫెస్టివల్ కు ఆహ్వానిస్తోందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *