BRS పై KA పాల్ కి కోపం వచ్చింది.. ఎందుకంటే..?
ఆంధ్రప్రదేశ్ లో BRSలో చేరేందుకు సిద్ధమైన నేతలపై కేఏ పాల్ విమర్శలు గుప్పించారు. డబ్బులకు ఆశపడే తోట చంద్రశేఖర్ BRSలో చేరుతున్నారని.. విలువలు లేని రాజకీయాలకు తోట తెరతీశారని పాల్ ఆరోపించారు. అటు రావెల కిషోర్ బాబు అవినీతి చక్రవర్తి అంటూ పాల్ ఫైరయ్యారు. నీతి నియమాలు లేనివారే కేసీఆర్ పార్టీలో చేరుతారని.. రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని ఏపీ నేతలు కేసీఆర్కు తాకట్టుపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కుక్కలు, నక్కలు, నీచుల వలే కేసీఆర్ పార్టీలో జాయిన్ అవుతున్నారని అన్నారు. వేల కట్లకు ఆశపడి ఆంధ్ర ప్రజల ఆత్మగౌరవాన్ని వీళ్ళు తాకట్టు పెడుతున్నారని మండిపడ్డారు. రావెళ కిషోర్ అవినీతి చక్రవర్తి అని… తోట చంద్రశేఖర్‌ను కాపు సమాజం వెలి వేయడం ఖాయమన్నారు.