కల్వకుంట్ల చంద్రశేఖర రావు ది అచీవర్ పుస్తక ముఖచిత్రం ఆవిష్కరణ
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలని భావిస్తున్న తరుణంలో కేసీఆర్ సాధించిన విజయాలు,కార్యదక్షత ఒక అచీవర్ గా తన ప్రస్థానాన్ని ” కల్వకుంట్ల చంద్రశేఖర రావు ది అచీవర్ ” పేరుతో పుస్తక రూపంలో తీసుకురావాలన్న ఆలోచన శుభసూచకం,అభినందనీయం అని తెలంగాణ రాష్ట్ర హోమ్ మంత్రి మహ్మద్ మహమూద్ అలీ అన్నారు.
తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నిజం చేస్తూ,తెలంగాణ రాష్ట్ర సాధనతో బంగారు తెలంగాణను సుసాధ్యం చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సాధించిన విజయాలను ” కల్వకుంట్ల చంద్రశేఖర రావు ది అచీవర్ ” పేరుతో ఇంగ్లీష్ లో త్వరలో వెలువడనున్న సందర్భంలో హోమ్ మంత్రి తన కార్యాలయంలో పుస్తకం ముఖచిత్రాన్ని ఆవిష్కరించారు.రచయితలు డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి విజయార్కె రచించిన ” కల్వకుంట్ల చంద్రశేఖర రావు ది అచీవర్ ” పుస్తకం త్వరలో విడుదల చేయబోతున్నట్టు డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి తెలియజేసారు.”
తెలంగాణ రాష్ట్ర సాధన మొదలు ముఖ్యమంత్రి సాధించిన ఎన్నో అచీవ్మెంట్స్.భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని ,ఒక వ్యక్తి తపన తపస్సు నిబద్ధత ఎన్నో విజయాలను అందిస్తుందని అందుకు ఉదాహరణ “” కల్వకుంట్ల చంద్రశేఖర రావు ది అచీవర్ ” పుస్తకం అని పుస్తక రచయితలు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పోలీసు హౌసింగ్ కార్పోరేషన్ ఛైర్మన్ కోలేటి దామోదర్ గుప్త తదితరులు పాల్గొన్నారు..