నటుడు కైకాల సత్యనారాయణ కన్నుమూత..!
తెలుగు చిత్ర సీమలో మరో చోటు చేసుకుంది. సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ ఇవాళ ఉదయం కన్నుమూశారు. గత కొంత కాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తుది శ్వాసవిడిచారు. ఆయన మరణం పట్ల టాలీవుడ్ ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. ఇక ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.

కైకాల తెలుగు వారికి యముడిగా సుపరిచితుడు. ఎన్నో సినిమాల్లో యమధర్మరాజుగా కనిపించి మెప్పించాడు. ఎలాంటి పాత్రనైనా అవలీలగా పోషించగల నటుడు. విలనిజంలో కొత్తదనాన్ని తీసుకొచ్చాడు. కామెడీ, ఎమోషన్ ఇలా ఏ పాత్రను ఇచ్చినా కూడా ఆయన తన పూర్తి న్యాయం చేశారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ తరం నుంచి.. ఇప్పటి తరం హీరోలతోనూ పని చేశారు. చిరంజీవి, బాలయ్య, నాగ్, వెంకీ సినిమాల్లో ఆయన ఎక్కువగా నటించారు.
మహేష్ బాబు, ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి హీరోలతోనూ ఆయన నటించారు. చివరగా ఆయన మహర్షి సినిమాలో నటించారు. అయితే కైకాల ఇప్పుడు అస్తమవ్వడంతో తెలుగు చిత్ర సీమ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాడు. చివరగా కైకాల బర్త్ డేను చిరంజీవి సెలెబ్రేట్ చేశాడు.ఆయన బెడ్డు మీద ఉండగానే చిరంజీవి ఇంటికి వెళ్లి కేక్ కట్ చేయించాడు. చిరు అలా తన బర్త్ డేను సెలెబ్రేట్ చేయడంతో కైకాల మురిసిపోయారు. చిరునవ్వులు చిందిస్తున్న ఆ ఫోటోలు సైతం నెట్టింట్లో తెగ ట్రెండ్ అయ్యాయి.