మియాపూర్‌లో ఆస్పైర్ స్పేస్ అమేయా ప్రాజెక్ట్ ను ప్రారంభించిన చిన్న జీయర్ స్వామి
హైదరాబాద్
ప్రతి మనిషికి దైనందిన జీవితంలో సొంత ఇల్లు అవసరమని ,మనం చేసే సంకల్పాలు,యాగాలు,పూజల మీదనే మనిషి జీవన విధానం ఆదారపడి ఉంటుందని ప్రముఖ ఆధ్మాత్మిక వేత్త చిన్న జీయర్ స్వామి అన్నారు. హైదరాబాద్ మియాపూర్‌లో అస్పైర్ స్పేస్ సంస్థ నిర్మించిన అమేయా ప్రాజెక్ట్ కు చిన్నజీయర్ స్వామి భూమిపూజ చేసి ప్రారంభించారు.
మనం నివసించే మన స్వంత ఇల్లు మనసుకు ఆనందంతో పాటు, మంచి ఆలోచనను, మంచి ఉన్నతిని సాధించేలా మన గృహం అండగా ఉంటుందన్నారు. మనం ఏ పక్కన ఉండాలి, మనం దిశన పడుకొవాలి, వాస్తు, ఇతర అంశాలలో మనం తీసుకునే నిర్ణయంపై మన కుటుంబ అభివృద్ది ఆధారపడి ఉంటుందని ఆయన అన్నారు.
ఆస్పైర్ స్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ నరసింహరెడ్డి మాట్లాడుతూ మియాపూర్ లో పది ఎకరాల విస్తీర్ణంలో 13 అపార్ట్ మెంట్ లు నిర్మిస్తున్నామని తెలిపారు. అస్పైర్ స్పేస్ అమేయా , 1210 చదరపు అడుగుల నుంచి 1940 చదరపు అడుగులలో 2,3 BHK ఫ్లాట్స్‌ను నిర్మిస్తున్నట్లు ఆయన తెలిపారు. మొత్తం ఈ 13 అపార్ట్ మెంట్ లలో 1066 ఫ్లాట్స్ నిర్మిస్తున్నామని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ లో ఒక్కో చదరపు అడుగుకి 4వేల 700 ధరను నిర్ణయించామని నరసింహారెడ్డి తెలిపారు .2024కల్లా ఈ ప్రాజెక్ట్ పూర్తవుతుందన్నారు .
భూముల విలువను తెలంగాణ ప్రభుత్వం పెంచినప్పటికీ తక్కువ ధరలోనే ఫ్లాట్లు వినియోగదారులకు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ స్వరణ్, శాసన మండలి ప్రొటెం చైర్మన్ వెన్నవరం భూపాలరెడ్డి, పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, శేరిలింగంపల్లి ఎమ్మెల్యె అరికెపూడి గాంధీ, జడ్చెర్ల లక్ష్మారెడ్డి, అమీన్ పూర్ మునిసిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు