హైదరాబాద్ మాదాపూర్ లో జిందాల్ పాంథర్ మార్ట్ ప్రారంభం

హైదరాబాద్, మాదాపూర్

ప్రపంచ వ్యాప్తంగా ఐరన్ కు మంచి డిమాండ్ ఉందని జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ సేల్స్ అండ్ మార్కెటింగ్ ప్రెసిడెంట్ విజయ్ కుమార్ చామ తెలిపారు.

హైదరాబాద్ మాదాపూర్ హండ్రెడ్ ఫీట్ రోడ్ లో జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ కు చెందిన జిందాల్ పాంథర్ మార్ట్ ను ఆయన ప్రారంభించారు. ముడి సరుకుల ధరలు పెరగడంతో మార్కెట్ లో ఐరన్ ధరలు భారీగా పెరిగాయన్నారు. కొంత మంది డీలర్లు కృత్రిమ కొరత సృష్టించి ఎక్కువ ధరలకు స్టీల్ ను అమ్ముతున్నారని దీంతో మార్కెట్ లో ఐరన్ ధరలు విపరీతంగా పెరిగాయన్నారు. నేరుగా వినియోగదారులకు నాణ్యమైన స్టీల్ ను అందించేందుకు జిందాల్ పాంథర్ మార్ట్ లను ఏర్పాటు చేస్తున్నట్లు విజయ్ కుమార్ తెలిపారు.

ఆయా ప్రాంతాల్లో ఉన్న సాయిల్ ను బట్టి ఏ స్టీల్ వాడాలి, ఏ గ్రేడ్ స్టీల్ వాడాలి, స్టీల్ ధరలు ఎంత ఉన్నాయో వంటి వివరాలు తెలుసుకునేందుకు‌ జిందాల్ పాంథర్ మార్ట్ ఎక్స్ పీరియన్స్ సెంటర్ లు ఏర్పాటు చేశామన్నారు. అంతర్జాతీయంగా కోల్, ఐరన్ ధరలు తగ్గితే స్టీలు ధరలు కిందికి దిగివస్తాయని తెలిపారు. దేశవ్యాప్తంగా మరో 50 కొత్త జిందాల్ పాంథర్ మార్ట్ లను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ (JSPL)నుంచి TMT బార్లు, ప్లేట్, స్ట్రక్చరల్ స్టీల్, రైల్, షీట్ పైల్స్ లాంటి ఉత్పత్తులు ఈ మార్ట్ లో లభిస్తాయని విజయ్ కుమార్ తెలిపారు. కొత్త తరం ప్రీమియం క్వాలిటీ రిబ్బెడ్ థర్మో మెకానికల్ ట్రీటెడ్ (TMT) బార్‌లు అధిక బలం కలిగి ఉంటాయన్నారు.

స్టీల్, మైనింగ్, పవర్ జనరేషన్ , ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి రంగాలలో గణనీయమైన ఉనికిని కలిగిన సంస్థ జిందాల్ స్టీల్ , పవర్ లిమిటెడ్ (JSPL)అని జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ సేల్స్ అండ్ మార్కెటింగ్ ప్రెసిడెంట్ విజయ్ కుమార్ చామ తెలిపారు. భారతదేశంలోని ప్రధాన ఉక్కు ఉత్పత్తిదారులలో జిందాల్ ఒకటని… US $ 3.5 బిలియన్‌ల వార్షిక టర్నోవర్‌ కలిగి ఉందన్నారు. JSPL ఉక్కు, విద్యుత్, మైనింగ్ వ్యాపారాలను ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు ముఖ్యంగా ఆసియా, ఆఫ్రికా మరియు ఆస్ట్రేలియాలో విస్తరించిందన్నారు. TMT రీబార్స్ ,ఇతర స్టీల్ ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు అందించేందుకు జిందాల్ పాంథర్ మార్ట్ లు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *