తెలంగాణ ప్రభుత్వంతో జపాన్ డైఫుక్ కంపెని ఒప్పందం
ఒకవైపు మేకిన్ ఇండియా అంటున్నాం.. కానీ ప్రపంచంలో ఇతర కంపెనీలతో పోటీ పడే కంపెనీలను ఎందుకు సృష్టించడం లేదో ఒక్కసారి ఆలోచించాలని మంత్రి కేటీఆర్ అన్నారు. ఒకప్పుడు పెట్టుబడులు రావాలంటే ఎన్నో కష్టపడాల్సి వచ్చేదని.. కానీ ప్రభుత్వాలు సహకరించడంతో కంపెనీలకు పెట్టుబడులు దొరుకుతున్నాయని ఆయన పేర్కొన్నారు. జపాన్ కు చెందిన డైఫుక్ లాజిస్టిక్ కు చెందిన ఫ్లాంట్ ను తెలంగాణలో మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వంతో అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది. డైఫుక్ లాలిస్టిక్ సంస్థ తెలంగాణలో 450 కోట్లతో తయారీ యూనిట్ ను ఏర్పాటు చేస్తుంది ఆ సంస్థ. మరోవైపు తెలంగాణ ప్రభుత్వ సహకారానికి డైఫుక్ కంపెనీ లిమిటెడ్ సంస్థ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. భారతదేశంలో కార్యకలాపాలకు కంపెనీ కట్టుబడి ఉన్నదని పేర్కొన్నారు.
జపాన్ లో డైఫుక్ కంపెనీ లిమిటెడ్ ను 1937లో స్థాపించారు. తయారీ మరియు పంపిణీ, క్లీన్‌రూమ్, ఆటోమోటివ్ మరియు విమానాశ్రయ పరిశ్రమ మార్కెట్‌లకు మెటీరియల్ హ్యాండ్లింగ్ సిస్టమ్‌లను అందించడంలో ప్రపంచంలోనే అగ్రగామిగా ఇది ఉంది. డైఫుక్ కన్సల్టింగ్ నుండి అమ్మకాల అనంతర సేవల వరకు మొత్తం మద్దతు వ్యవస్థను ఏర్పాటు చేసింది. కంపెనీ ప్రధాన కార్యాలయం జపాన్‌లోని ఒసాకాలో ఉంది. మొత్తం 26 దేశాలు మరియు ప్రాంతాలలో ఉత్పత్తి మరియు విక్రయ స్థావరాలు ఉన్నాయి.
