జల సాధన ఉద్యమం ప్రారంభించాలి : తెలంగాణ జన సమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం

తెలుగు రాష్ట్రాల మధ్య తాజాగా నెలకొన్న నీటి వివాదాల నేపథ్యంలో మరో జల సాధన ఉద్యమం అనివార్యమని వక్తలు పేర్కొన్నారు. కృష్ణా నదీ జలాల కోసం ఐక్య ఉద్యమాల ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందని తెజస అధినేత ప్రొఫెసర్ ఎం. కోదండరాం కోరారు. జల సాధన ఉద్యమానికి పూనుకొని న్యాయం పొందాలని స్పష్టం చేశారు. హైదరాబాద్​లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అఖిలపక్ష రాజకీయ పార్టీల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కృష్ణా, గోదావరి నదులపై బోర్డులు ఏర్పాటు చేసి గెజిట్ విడుదల చేయడం.. ఇరు రాష్ట్రాల మధ్య కేంద్రం చిచ్చు పెట్టినట్లయిందని ఆక్షేపించారు. ఈ అంశం… ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య విబేధాలు సృష్టించకముందే.. సామరస్యంగా చర్చించడం ద్వారా పరిష్కరించాలని డిమాండ్ చేశారు. దేశంలో ఒక సమగ్రమైన జల విధానం తీసుకురావాలని కోదండరాం విజ్ఞప్తి చేశారు.
రెండు రాష్ట్రాలకు నష్టమేకృష్ణా, గోదావరి నదులపై ప్రాజెక్టుల ద్వారా నీటి కేటాయింపులు జరపకుండా ఏకంగా బోర్డులు ఏర్పాటు చేసి గెజిట్ విడుదల చేయడం అశాస్త్రీయమని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి తప్పుబట్టారు. అశాస్త్రీయమైన ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నా.. ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించడం లేదని ఆరోపించారు. అక్టోబరు 14 తర్వాత ఈ గెజిట్‌ అమల్లోకి వస్తున్న దృష్ట్యా… రెండు రాష్ట్రాలకు ఇబ్బందే అని అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రానికి అధిక నష్టం వాటిల్లుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తాజా పరిణామాలపై రాష్ట్రాల మధ్య వివాద పరిష్కారం కోసం కేంద్రం పెద్దన్న పాత్ర పోషించి సమస్య పరిష్కరించాలని ఏఐసీసీ అధికార ప్రతినిధి శ్రవణ్‌కుమార్ సూచించారు. ఇద్దరు సీఎంలను కూర్చోబెట్టి జల వివాదాన్ని పరిష్కరించాలని డిమాండ్ చేశారు.బండి సంజయ్​ ఇవ్వొద్దని చెప్పారుమేలో రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఏపీ ప్రభుత్వం జీవో విడుదల చేసిందని తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల సంఘం ప్రధాన కార్యదర్శి ఎం. శ్యామ్​ ప్రసాద్​ రెడ్డి అన్నారు. ఆ సమయంలో కేంద్రానికి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ లేఖ రాశారని గుర్తు చేశారు. కేంద్ర మంత్రి ప్రకాష్ జావేడేకర్‌ను కలిసి తెలంగాణలో సీడబ్ల్యూసీ అనుమతులు లేకుండా పర్యావరణ అనుమతులు ఇవ్వందంటూ చెప్పారని అన్నారు. ఈ వ్యాఖ్యలపై భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి ప్రకాష్‌రెడ్డి అభ్యంతర వ్యక్తం చేయడంతో… సమావేశంలో కొద్దిసేపు వాగ్వాదం, గందరగోళం నెలకొంది.ఈ సమావేశంలో తెదేపా పాలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక అధ్యక్ష, కార్యదర్శులు బోదనపల్లి వేణుగోపాల్‌రెడ్డి, సాధిక్, సాగు నీటి రంగ నిపుణులు తదితురులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *