జైనులు ఆత్మశుద్ది ,పాప పరిహారం కోసం ఉపవాస దీక్షలు -సాద్వి త్రిస్లా కుమారి
జైన్ సమాజం లో ప్రతి ఏటా జైనులు తమ ఆత్మశుద్ధి కోసం, పాప పరిహారం కోసం ఉపవాస దీక్షలు చేయనున్నట్లు సాద్వి త్రిస్లా కుమారి తెలిపారు.. దాదాపు ఏడు రోజులుగా ఉపవాస దీక్షలు చేస్తున్న వారంతా నేటితో ఉపవాస దీక్ష విరమణ చేస్తున్నట్లు తెలిపారు. జైన్ స్వేతాంబర్ తెరాపంత్ సభలో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న జైనులంతా సికింద్రాబాద్లోని రాజరాజేశ్వరి గార్డెన్ లో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జైన మత గురువైన త్రిశ్లా కుమారి పాల్గొని ఉపన్యాస ప్రవచనాలు ఇచ్చారు. జైన్ సమాజం మానవ విలువలను శాంతి కోసం పరితపిస్తుందని అన్నారు.. తాము చేసిన పొరపాట్లను సరిదిద్దుకునే క్రమంలో భగవంతునితో క్షమాపణ కోరుకుంటామని అన్నారు. ధ్యాన్ దివస్ కార్యక్రమంలో భాగంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల నుండి బయటపడడంలో ధ్యానం ఏకాగ్రత కు ప్రత్యేక స్థానం ఉందని ఆమె తెలిపారు.. సమస్యలకు పరిష్కార మార్గం కోసం ధ్యానం చేయడం ఉత్తమ సాధనమని పేర్కొన్నారు. లోక కళ్యాణార్థం ప్రపంచశాంతి కోసం జైన సమాజం ఏడు రోజులపాటు ప్రత్యేక పూజలు నిర్వహించి చివరి రోజున ఉపవాస దీక్షలు విరమించినట్లు తెలిపారు..