ఇస్రో చేప‌ట్టిన‌ పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ -సి52 విజ‌య‌వంతం

శ్రీహరికోట :

భారత అంతరిక్ష రంగంలో మరో అద్భుతానికి ముందడుగు పడింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన వాహననౌక పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ -సి52 విజయవంతమైంది. సోమవారం ఉదయం 5.59 గంటలకు రాకెట్ నింగిలోకి దూసుకుపోయింది. ఆంధ్రప్రదేశ్‎లోని పోట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష ప్రయోగం కేంద్రం ఈ ప్ర‌యోగం చేపట్టారు. మూడు ఉపగ్రహాలతో పాటు ఈవోఎస్‌-04, ఐఎన్‌ఎస్‌-2టీడీ, ఇన్‌స్పైర్‌ శాట్‌-1 ఉపగ్రహాలను పీఎస్‌ఎల్వీ- సీ52 రోదసిలోకి మోసుకెళ్లింది. 1,710 కిలోల ఆర్‌ఐ(ఈవోఎస్‌-04), 17.50 కిలోల ఐఎన్‌ఎస్‌-2టీడీ..8.10 కిలోల ఇన్‌స్పైర్‌ శాట్‌-1 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.

పీఎస్ఎల్వీ-52 రాకెట్ ప్రయోగం విజయవంతమైందని ఇస్రో ఛైర్మన్ డాక్టర్ సోమనాథ్ వెల్లడించారు. శాస్త్రవేత్తల కృషి ఫలించిందన్నారు. ఈ సందర్భంగా ఇస్రో శాస్త్రవేత్తలను ఆయన అభినందించారు.

క‌క్ష్య‌లో ప్రవేశపెట్టిన ఉపగ్రహాలివే..

భవిష్యత్తు సైన్సు, ప్రయోగాత్మక పేలోడ్స్ కోసం ఐఎన్ఎస్ 2టీడీ ఉపగ్రహం
వ్యవసాయం, అటవీ, నీటి వనరుల సమాచారం కోసం ఆర్ఐశాట్-1 ఉపగ్రహం
ఇన్ స్పైర్ శాట్ -1:వ భూమి అయానోస్పియర్ అధ్యయనం కోసం ఇన్‎స్పైర్ శాట్ -1 ఉపగ్రహం
ఐఎన్ఎస్-2టీడీ: భారత్, భూటాన్ సంయుక్తంగా రూపొందించిన ఉపగ్రహం. ఈ ఉపగ్రహ జీవితకాలం ఆరు నెలలు. దీని బరువు 17.5 కిలోలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *