హ్యాండ్ బాల్ సబ్ జూనియర్ నేషనల్స్ కు ఐటీ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్ కు ఆహ్వానం
హైదరాబాద్
హైదరాబాద్ సరూర్ నగర్ లో అక్టోబరు ఏడో తేదీ నుంచి జరగనున్న హ్యాండ్ బాల్ సబ్ జూనియర్ నేషనల్స్ ప్రారంభోత్సవం కానున్నాయి. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా హాజరుకావలని ఐటీ ముఖ్య కార్యదర్శి గా జయేష్ రంజన్ ను హ్యాండ్ బాల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు జగన్మోహన్ రావు మర్యాద పూర్వకంగా సెక్రటేరియట్ లోని వారి ఛాంబర్ లో కలిశారు.
తెలంగాణ లో ఒలింపిక్ అసోసియేషన్ క్రియాశీలకంగా పని చేయాలని , తెలంగాణ రాష్ట్రంలో అన్ని క్రీడా సంఘాలను బలోపేతం చేయాలని కోరారు. రానున్న రోజుల్లో అన్ని క్రీడా సంఘాలు కూడా రాష్ట్ర స్థాయి పోటీలు, జాతీయ స్థాయి పోటీలు, అంతర్జాతీయ స్థాయి పోటీలు తెలంగాణ లో నిర్వహించాలని అందుకు కావాల్సిన తగు సహాయ సహకారాలు అందజేయడానికి తమ వంతు కృషి చేస్తామని ఈ సందర్భంగా జయేష్ రంజన్ తెలిపారు.
వచ్చే నెల అక్టోబర్ 7వ తేదీ నుండి 11 వ తేదీ వరకు సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో జరగనున్న 37వ హ్యాండ్ బాల్ సబ్ జూనియర్ నేషనల్స్ కు ఐటీ ప్రిన్సిపాల్ సెక్రెటరీ శ్రీ జయేష్ రంజన్ ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర రెడ్డి కూడా పాల్గొ