హైదరాబాద్ లో కలర్ ఫుల్ గా సాగిన ఇండీ రాయల్ మిస్ అండ్ మిసెస్ ఇండియా 2021 పోటీలు

హైదరాబాద్, బంజారాహిల్స్

మహిళలు అన్ని రంగాల్లో రాణించేలా ఇండీ రాయల్ సంస్థ కృషి చేస్తుందని ఇండీ రాయల్ ప్రతినిధి డోలీ త్రిపాఠి తెలిపారు.

హైదరాబాద్ బంజారాహిల్స్ లోని రాడిసన్ హోటల్ లో ఇండి- రాయల్ మిస్- మిస్సెస్ ఇండియా 2021 గ్రాండ్ ఫినాలే పోటీలు కలర్ ఫుల్ గా జరిగాయి.

ఈవెంట్ నిర్వాహకులు రోలి త్రిపాఠి, చావి అస్థాన, అభిషేక్, షెర్లాక్స్ లాంజ్ అండ్ కిచెన్ ఎండీ ప్రీతిరెడ్డి ఈవెంట్ గురించి మాట్లాడారు.

దేశవ్యాప్తంగా ఉన్న మహిళల టాలెంట్ ను గుర్తించేందుకు ఆడిషన్స్ నిర్వహించామని డోలి త్రిపాఠి తెలిపారు.


ఈ పోటీల్లో పాల్గొనేందుకు ఆసక్తి ఉన్న వారి నుంచి ఆన్ లైన్ లో నుంచి దరఖాస్తులు స్వీకరించినట్లు వారు తెలిపారు. కరోనా నేపథ్యంలో ఆన్ లైన్ లో ఇంటర్వ్యూలు చేయగా, ఫైనల్ పోటీల్లో 42 మంది ఎంపిక అయ్యారని వారు చెప్పారు.

ఈ ఏడాది మొట్టమొదటి సారిగా హైదరాబాద్ లో ఫైనల్స్ నిర్వహించామన్నారు. ఈ పోటీలకు ప్రజల నుంచి మంచి స్పందన లభించిందన్నారు. ఇండీ రాయల్ ఫైనల్ పోటీలకు న్యాయనిర్ణేతలుగా సినీ ప్రముఖులు అర్చన శాస్త్రి, తెలుగు ఫిల్మ్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం.శివ శంకర్, పేజ్3 సెలెబ్రిటీ లు హాజరయ్యారు.

అనంతరం నిర్వహించిన ఫ్యాషన్ షోలో టైటిల్ దక్కించుకునేందుకు మహిళలు పోటీపడ్డారు. సరి కొత్త వెరైటీ డిజైనరీ వేర్ తో మెరిసిపోయారు.

ఈ ఈవెంట్ కు ఎసెన్స్ మీడియా సంస్థ మీడియా పార్ట్ నర్ గా వ్యవహరించింది. ఈ ఫైనల్ పోటీలకు మీడియా కోఆర్డినేషన్ చేసిన ఎసెన్స్ మీడియా పీఆర్ ఫౌండర్ రవి కలమందకు అవార్డుతో సత్కరించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *