హైదరాబాద్ రాడిసన్ బ్లూ హోటల్ లో ఆగస్ట్ 20 నుంచి 22వ తేదీ వరకు ఇండీ రాయల్స్ మిసెస్ ఇండియా 2021 ఫైనల్స్ పోటీలు
హైదరాబాద్,కూకట్ పల్లి
ఢిల్లీ కేంద్రంగా పని చేస్తున్న ఇండీ రాయల్ సంస్త మహిళా సాధికారికత కోసం కృషి చేస్తోంది. ఈ సంస్థ తన ఆరవ సెషన్స్ ను హైదరాబాద్ వేదికగా నిర్వహిస్తోంది . ఇండీ రాయల్ మిస్ అండ్ మిసెస్ ఇండియా ఆడియన్స్ పూర్తి చేసుకుంది.
కరోనా కారణంగా ఈ ఏడాది జూమ్ ద్వారా అడిషన్స్ నిర్వహించామని… దేశ వ్యాప్తంగా మొత్తం 40 మంది మహిళలు ఎంపిక అయ్యారని…హైదరాబాద్ నుంచి నలుగురు ఎంపిక అయినట్లు ఇండీ రాయల్ మిస్ ఇండియా ఆర్గనైజర్ ఛావి ఆస్తానా తెలిపారు. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని రాడిసన్ హోటల్ లో ఈ ఆగస్ట్ 20 నుంచి రెండు రోజుల పాటు ఇండీ రాయల్ మిసెస్ ఇండియా 2021 ఫైనల్స్ నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు . ఆగస్ట్ 22 వ తేదీన దేశ వ్యాప్తంగా ఎంపికైన మహిళలతో ఫ్యాషన్ షో నిర్వహింస్తున్నట్లు వారు తెలిపారు. సాయంత్రం మూడు గంటలకు ప్రారంభమయ్యే ఈ ఫ్యాషన్ షోలో టాలీవుడ్ ,బాలీవుడ్ నటులు ,డిజైనర్లు పాల్గొంటారని …అదే రోజు విన్నర్లను ప్రకటిస్తామన్నారు