గ్రీన్ ఇండియా చాలెంజ్ సమర్పణలో సీఎం కేసీఆర్ పుట్టినరోజు పురస్కరించుకుని ప్రత్యేక గీతం ఆవిష్కరణ
హైదరాబాద్ ,బంజారాహిల్స్
దేశానికి దిశానిర్ధేశం చూపేంచే దిశగా సీఎం కేసీఆర్ నిర్ణయాలు ఉన్నాయని హోం మంత్రి మహూముద్ అలీ, ఎంపీ రంజిత్ రెడ్డిలు అన్నారు .హైదరాబాద్ ఎల్వీ ప్రసాద్ డిజిటల్ ల్యాబ్ లో గ్రీన్ ఇండియా చాలెంజ్ కో ఫౌండర్ రాఘవ నిర్మాతగా ,పూర్ణ దర్శకత్వంలో,మాట్ల తిరుపతి రచనలో రూపొందించిన ప్రత్యేక గీతాన్ని ఆయన ఆవిష్కరించారు. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్, గ్రీన్ఇండియా చాలెంజ్ సమర్పణలో సీఎం కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని ఈ సాంగ్ విడుదల చేయడం సంతోషంగా ఉందన్నారు. గాంధీ తర్వాత అంతటి గొప్ప నాయకుడు సీఎం కేసీఆర్ మహుమూద్ అలీ కొనియాడారు.ప్రాణం పోయిన పర్వాలేదు అని తెలంగాణ కోసం కోట్లాడి సాధించారని.. ఇప్పుడు దేశంలోనే నెంబర్ వన్ గా నిలిపారని అన్నారు.సిఎం కేసీఆర్ నాయకత్వం లో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని అన్ని పండుగలు ఘనంగా జరుపుతున్నారని అన్నారు.రాష్ట్రం రాకముందు కమ్యునల్ గొడవలు ఉండేవి ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదని తాగునీటి,సాగునీటికి ఇబ్బందులు లేదన్నారు.
కొత్త ప్రయాణానికి నాంది పలుకాబోతున్న సీఎం కేసీఆర్ నిండునూరేళ్లు ఆయురారోగ్యాలు కలగాలని ఎంపీ రంజీత్ రెడ్డి ఆకాక్షించారు.ఈ పుట్టినరోజు ప్రత్యేకమైనదని రేపటి నుండి కొత్త భారత నిర్మాణం కోసం అడుగులు వేస్తున్నరని అందరూ వేచిచూస్తున్నారని అన్నారు.అహర్నిశలు పోరాడి తెలంగాణ తెచ్చి బంగారు తెలంగాణ చేశారని ఇప్పుడు భారతదేశంలో ఉన్న సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నారని తెలిపారు.ఇంత మంచి సాంగ్ రూపొందించిన రూపకర్తలకు ఎంపీ రంజిత్ రెడ్డి అభినందనలు తెలియజేశారు.
తెలంగాణ సాధించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో ఏళ్ళు శ్రమించారని ఎందరో అవహేళన చేసిన అన్ని తట్టుకొని అసాధ్యాన్ని సుసాధ్యం చేశారని బోరబండ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ అన్నారు.దేశానికి సీఎం కేసీఆర్ నాయకత్వం అవసరం ఎంతగానో ఉందన్నారు. మతోన్మాద శక్తుల నుండి దేశానికి విముక్తి లభించాలంటే దేశానికి సీఎం కేసీఆర్ నాయకత్వం అవసరం అని అన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని అందరం ప్రార్థిద్దామని బాబా ఫసియుద్దీన్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీఎస్ ఐ ఐ సి చైర్మన్ గ్యాదరి బాలమల్లు,టీఆరెస్ సీనియర్ నాయకులు మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి,రామ్మూర్తి,బోరబండ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్,బిసి కమిషన్ సభ్యుడు కిషోర్ గౌడ్,టీఆరెస్ శ్రేణులు పాల్గొన్నారు.